Early Morning Food: మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం హాని చేసే వాటిని తీసుకుంటే మనకు చెడు చేస్తాయి. అదే ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మన శరీరం కూడా అందుకు సహకరిస్తుంది. దీంతో రోజంతా హాయిగా ఉంటూ చక్కగా పనిచేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. లేదంటే డాక్టర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఏదైనా మన అలవాట్లలోనే మన ఆరోగ్యం ఇమిడి ఉంటుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫలితంగా రోగాలు కూడా చుట్టుముడుతున్నాయి. వందేళ్లు హాయిగా ఉండాల్సిన మన శరీరాన్ని యాభై ఏళ్లకే పరిమితం చేస్తున్నాం. లేని రోగాలు కొనితెచ్చుకుంటూ మందులు వాడుతూ జీవక్రియను నాశనం చేసుకుంటున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయం మరిచిపోతున్నాం.

ప్రతి రోజు ఉదయం లేవగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోజంతా ఎంతో హాయిగా గడిచిపోతుంది. దీనికి మనం చేయాల్సిన పని ఒక్కటే. మన మనసును అదుపులో పెట్టుకుని కొన్ని ఆహార అలవాట్లు తప్పనిసరి చేసుకోవడం. రోజు ఉదయం లేవగానే ఓ గ్లాస్ మంచినీళ్లు వేడి చేసుకుని తాగితే కడుపులో ఉన్న మలినాలను బయటకు పంపిస్తుంది. దీంతో రోజంతా మనకు కడుపులో ఎలాంటి గడబిడలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీనికి గాను మనం ఓ గ్లాస్ వాటర్ తీసుకుంటూ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు మనమే చొరవ చూపాలి.

పరగడుపునే బొప్పాయి తింటే మంచిది. ఉదయం అల్పాహారంగా ఈ పండు తీసుకుంటే ప్రొటీన్లు బాగా అందుతాయి. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయే చెడు కొవ్వు పదార్థాలను బయటకు పంపి మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఉదయం అల్పాహారంలో దీన్ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పుచ్చకాయ కూడా మనకు మంచి మేలు చేస్తుంది. ఉదయం ఆహారంలో దీన్ని తీసుకుంటే కడుపుకు చాలా మంచిది. ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. అందుకే ఈ పండు తింటే మనకు శక్తి తోపాటు మినరల్స్, ప్రొటీన్లు కూడా అందుతాయి. ఉదయం ఆహారంలో దీన్ని తీసుకుంటే మన ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. రోగాలు దరి చేరవు. అందుకే ప్రతి రోజు మన ఆహారంలో పుచ్చకాయను కూడా చేర్చుకోవడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.

బాదంపప్పు కూడా మంచి డ్రైనట్స్. మనం రోజూ ఆహారంలో తీసుకుంటే మనకు ఎంతో మేలు చేస్తుంది. రోజంతా హుషారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఎంతో ఆరోగ్యం చేకూరుస్తుంది. దీంతో శరీరం అలసటకు గురి కాకుండా ఉంటుంది. రోజంతా మన పనులు మనం చేసుకునేందుకు సహాయడుతుంది. అందుకే ఉదయం పూట ఓ పిడికెడు బాదంపప్పును తీసుకుంటే మంచిది.

ప్రతి రోజు ఉదయం కూరగాయల రసం తాగితే కూడా చాలా మంచిది. క్యారెట్, బీట్ రూట్, కీర దోస, టమాట, సొరకాయ, బీరకాయ తదితర కూరగాయలను అన్నింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే అవకాశం ఉంటుంది. దీనికి గాను ఉదయం ఏం తీసుకోకుండానే ఈ జ్యూస్ చేసుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. అందరు విధిగా వీటిని పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు మన దరిచేరవు. మనకు ఎలాంటి నష్టం జరగదు. అందుకే ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ అలవాట్లను క్రమం తప్పకుండా ఆచరించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
