Jubileehills Gang Rape: పిల్లల్లో నేర సంస్కృతి పెరిగిపోతోంది. చదువుకునే వయసులో సామాజిక మాధ్యమాల ప్రభావంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంతో అశ్లీల చిత్రాలు చూస్తూ రెచ్చిపోతూ అభాగ్యుల జీవితాలను హరిస్తున్నారు. నూరేళ్ల భవిష్యత్ ఉన్న ఆడపిల్లల జీవితాలను మధ్యలోనే తుంచేస్తున్నారు. వారికి ఓ మేజరైన వ్యక్తి సహకరిస్తూ వారిని వీధి రౌడీల్లా తయారు చేశాడు. దీంతో ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నారు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాల్సిన బంగారు భవిష్యత్ కాస్త కుక్కలు చింపిన విస్తరిగా మారుతోంది. క్షణిక సుఖం కోసం వారు ఇంతలా దిగజారడానికి తల్లిదండ్రులు కూడా కారకులే. తమ పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై కనీసం దృష్టి పెట్టకపోవడం దారుణమే. ఇప్పుడు ఏం జరిగింది? వారి జీవితం ఇక జైల్లోనే మగ్గడం ఖాయమే. దీనికి ఎవరు మూల్యం చెల్లిస్తున్నారు. కానీ ఓ బాలిక మాత్రం తన బతుకు పోరాటంలో సమిధగా మారిపోయింది.

జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో షాబుద్దీన్ ఒక్కడే సంగారెడ్డి వాసి కాగా మిగతా వారందరు కూడా భాగ్యనగర పరిసర వాసులే వీరికి షాబుద్దీన్ అన్ని సమకూరుస్తూ వారికి అన్ని అలవాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేప్ కు కూడా వారిని ఉసిగొల్పినట్లు విచారణలో వెల్లడయింది. పరీక్షలు రాసి ఖాళీగా ఉండటంతో వారు నిత్యం పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్తూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతోనే వారికి కనిపించిన బాలికలను లక్ష్యంా చేసుకుని రేప్ చేయాలని పథకం వేసినట్లు తెలుస్తోంది. దీనికి షాబుద్దీన్ కూడా సహకరించినట్లు సమాచారం.
అశ్లీల చిత్రాలు, వెబ్ సిరీస్ లే వారికి ప్రేరణ కలిగించాయని తెలుస్తోంది. దీంతోనే వారిలో నేర సంస్కృతి పెరిగిపోయింది. వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్ లలో పార్టీలు ఏర్పాటు చేస్తూ వారిలో విష సంస్కృతి పెరిగేందుకు దోహదం చేసినట్లు తెలుస్తోంది. దీంతోనే వారు గతి తప్పిన విధంగా ప్రవర్తిస్తున్నారు. సిగరెట్లు, మందు తాగుతూ తమ భవిష్యత్ ను అంధకారంలో పడేసుకుంటున్నారు. వారు చెబుతున్న నిజాలతో పోలీసులు సైతం కంగుతిన్నారు. ఇంత చిన్న వయసులో ఇలాగానే ఉండేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను సరిగా పెంచే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవడం లేదని చెబుతున్నారు.

అత్యాచారం కేసులో నిందితులపై అబియోగ పత్రాలు నమోదు చేసే అంశంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. వారి పోలీస్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో వారిని తిరిగి జువెనైల్ హోంలోనే ఉంచుతారు. మొత్తానికి నగరంలో ఇలాంటి దారుణం జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నరం నడిబొడ్డున అత్యాచార ఘటన అందరిలో భయం పుట్టిస్తోంది. భావిభారత పౌరులను తయారు చేయాల్సిన తల్లిదండ్రులు నేరస్తులుగా మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి ఏ శిక్షలు పడతాయో అని ఇప్పుడు భయపడితే ఏం లాభం. జరగాల్సిన నేరం జరిగి పోవడంతో ఇప్పటికైనా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరుతున్నారు.