Health Tips: మార్నింగ్ వాకింగ్ చేయడం శరీరానికి చాలా మంచిది. మెదడుకు, మనసుకు కూడా ఈ మార్నింగ్ వాకింగ్ వల్ల మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెయింటెన్ చేయాలి అనుకునేవారు కచ్చితంగా మార్నింగ్ వాకింగ్ , జాగింగ్ కు వెళ్తుంటారు. ఇంతకీ మీరు మార్నింగ్ వాక్ కు వెళ్తున్నారా? అయితే వచ్చిన తర్వాత ఏ ఆహారం తీసుకుంటున్నారు? అనే విషయాల గురించి అవగాహన ఉండాల్సిందే.
మార్నింగ్ వాకింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత మీరు తీసుకునే ఆహారం సరైనది కాకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అందులో మార్నింగ్ వాక్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తింటే మరింత మంచిది. బాదం, ఖర్జూరం, వాల్ న ట్స్ వంటి మిశ్రమ గింజలను తీసుకోవాలి. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్స్, శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఉదయం నడక తర్వాత మొలకలు తినడం చాలా మంచిది. దీని వలన ఈజీగా బరువు తగ్గడమే కాదు ఊబకాయం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే అధిక ఫైబర్ మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో తోడ్పడుతుంది. ఇక వీటితో పాటు ఉదయం పండ్లను ఆహారంగా తీసుకోండి. దీనివల్ల కూడా వెంటనే మీకు శక్తి వస్తుంది. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఉదయం వాక్ తర్వాత తినడం మరింత మంచిది అంటున్నారు నిపుణులు.
పండ్లు తినడం వల్ల విటమిన్ ఏ, సీ, కే, ఇ లు మాత్రమే కాదు కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు. బరువు ఆరోగ్యంగా తగ్గుతూ తగిన పోషకాలు అందుతాయి కాబట్టి మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.