Human Body: ఈ ప్రపంచమే కాదు మానవ శరీరం కూడా ఎన్నో రహస్యాలకు నిలయం. శరీరం గురించి కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు వాటి పని అవి చేస్తే.. మనసు మంచి చెడులు ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటుంది. ఇక కొన్ని బ్రెయిన్ తో ఆలోచించాల్సిందే. సరే కాసేపు ఈ ఆలోచనల గురించి పక్కన పెడితే మన శరీరంలో నాలుగు ఎప్పటికీ పెరగని పార్టులు ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి పెరగకుండా అలాగే ఉండిపోయిన ఆ అవయవాలు ఏంటో తెలుసుకోండి.
పుట్టిన తర్వాత మానవ శరీరంలో పెరుగుదల లేకుండా ఆగిపోయిన ఆ అవయవాలను ఒస్సికిల్స్ అంటారు. ఇవి మూడు రకాల చిన్న ఎముకలట. మన చెవి మధ్యలో ఉంటాయి. సుమారుగా 3 మిల్లీమీటర్ల సైజులు ఉంటాయి. ఇవి రెండు చెవుల్లో ఉంటాయి. మనిషి పుట్టే వరకు ఒస్సికిల్స్ ఎముకలు సైజు పెరుగుతూ ఉంటాయట. పుట్టిన తర్వాత మాత్రం వీటి ఎదుగుదల ఆగిపోతుందట. మనిషి చనిపోయే వరకు కూడా వీటి సైజు అదే విధంగా ఉంటుంది.
అయితే సైజు పెరిగేందుకు వాటికి తగిన ఖాళీ కూడా చెవిలో ఉండదట. వాటి సైజు పెరిగినా సమస్యనే, అలా అని లేకపోతే వినడం కష్టమే. చెముడు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక నాలుగవ అవయవం కనుగుడ్లు. ఇవి పుట్టినప్పుడు ఏ సైజులు ఉంటాయో అదే సైజులో చనిపోయేవరకు ఉంటాయి. తల మెదడు వంటివి పెరుగుతాయి కానీ కనుగుడ్ల సైజు మాత్రం పెరగదు.
ఈ నాలుగు పార్టులు తప్ప మిగతా అవయవాలు శరీరం పెరుగుతున్న కొద్ది వాటి పరిమాణం పెరుగుతుంటాయి. గుండె పిడికిలి సైజులో ఉంటుంది. ఇక జుట్టు, గోళ్ళు కూడా కత్తిరించినా పెరుగుతుంటాయి. కానీ వీటికి నొప్పి ఉండదు. కత్తిరించినా నొప్పి ఉండని భాగాలే వెంట్రుకలు, గోళ్లు.