Foot Pain: కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో సరైన ఆహారం తీసుకోవడం తో పాటు వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో చాలా వరకు కల్తీ ఉండడంతో అనేక రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల లావవుతున్నారు. వెయిట్ లాస్ కోసం ఎక్కువగా వ్యాయామం చేయాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. అయితే వ్యాయామం చేయడం వల్ల మోకాళ్ల నొప్పులతో పాటు పాదాల పై ప్రభావం చూపుతోంది. దీంతో విపరీతమైన పాదాల నొప్పి తో బాధపడే వారు ఎందరో ఉన్నారు. అసలు పాదాల నొప్పి ఎందుకు వస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..
పాదాలపై ఉండే చర్మం సున్నితమైనది అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరిస్తాం. అయినా మడమలు, పాదాల నొప్పి కొందరినీ వేధిస్తూ ఉంటాయి. ఇలా నొప్పి రావడాన్ని ఫాసిటిస్ అంటారు. ఈ నొప్పి పాదాల నుంచి ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఇది పెద్ద వయసు వారిలో కనిపిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే కాలు బయట పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అయితే ఈ నొప్పి నివారణకు ఏం చేయాలంటే?
కాలు మడమ నుంచి నొప్పి మొదలై పాదాల వరకు వెళ్తుంది. దీంతో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ నడిస్తే చాలా ఇబ్బందిగా మారుతుంది. దీనినే ప్లాంటర్ ఫాసిటిస్ అని అంటారు. ఇది దాదాపు పెద్ద వారిలో కనిపించే సమస్య. అంటే 40 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పిక్క కండరాలు బిగుతుగా ఉండి.. వాకింగ్ చేసే సమయంలో నొప్పి వేధిస్తూ ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు కూడా ఇదే సమస్యతో బాధపడుతారు.
ఈ సమయంలో ఒకటి నుంచి రెండు వారాలు ఉంటుంది. అయితే నొప్పి ప్రారంభమైన సమయంలో వీరు తమ కాళ్లను ఎత్తుగా ఉండే వస్తువులపై ఉంచుకోవాలి. నొప్పి భాగంలో ఐస్ తో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల రిలీఫ్ గా మారుతుంది. కుషన్డ్ హీల్, ఆర్చ్ సపోర్టట్ ఉన్న చెప్పులు లేదా షూస్ ధరించడం లేదా ఇన్సోల్స్ లేదా హీల్ ప్యాడ్ లు ధరించడం వల్ల నొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు సలహాలు ఇస్తున్నారు.