చాలామంది ఇది జరిగిన కొన్ని సంఘటనలను కొద్ది రోజుల లోపే మర్చిపోతూ ఉంటారు.పిల్లల విషయంలో కూడా చదివినవి ఏమాత్రం కూడా గుర్తు ఉండకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీనికి కారణం వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడమే. సాధారణంగా వయసు పెరుగుతున్న వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సర్వసాధారణమే. జ్ఞాపక శక్తి పెరగడం కోసం కొందరు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. వీటితో పాటు మన జ్ఞాపక శక్తి పెరగాలంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read..కడుపునొప్పిని సులువుగా తగ్గించడానికి పాటించాల్సిన చిట్కాలివే..?
సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన US లోని 1,000 మందిపై జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా వారు వయసులో ఉన్నప్పటినుంచి పెద్దవారు అయ్యేవరకు వారి జీవితంలో జరిగిన కొన్ని భావోద్వేగ సంఘటనలను, వారి జీవితంలో అనుభవించిన ఆనంద క్షణాలను గురించి తెలుసుకొని ఈ పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో దశాబ్ద కాలం తర్వాత వారి గురించి తెలుపమని అడగగా వారిలో కొంతమంది కొన్ని విషయాలను మర్చిపోవడం గుర్తించారు. కేవలం ఎవరైతే పాజిటివ్ ఆటిట్యూడ్ ను కలిగి ఉంటారో వారు మాత్రం వారి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Also Read..దంతాలు తెల్లగా మెరవడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే..?
సాధారణంగా వృద్ధాప్య దశ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి జ్ఞాపకశక్తి తగ్గడం సహజమే. కానీ వయసులో ఉన్నప్పుడు ఎవరైతే వారి ఆలోచనా విధానాలను ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఆలోచించి ఉంటారో, అలాంటి వారికి వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి స్థాయిలు కొద్ది వరకు మెరుగ్గా ఉన్నాయని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందుకే ఎక్కువ జ్ఞాపక శక్తిని కలిగి ఉండాలంటే మన ఆలోచనా ధోరణి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండేలా ఆలోచించడం వల్ల జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చనీ ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.