
సాధారణంగా కనిపించే దేవుళ్ళు డాక్టర్లు, నర్సులు అని అందరూ భావిస్తారు. పురుడు పోసి ప్రాణం పోయాల్సిన నర్సులే పిల్లల పై యమ పాశం విసురుతున్నారు. ప్రాణం పోయాల్సిన నర్సు అప్పుడే పుట్టిన ఎనిమిది మంది పిల్లల ప్రాణాలను తీసిన ఘటన ఇంగ్లండ్‌లోని చోటు చేసుకుంది. ఈ ఎనిమిది మందినే కాకుండా మరో పది మంది పిల్లలపై హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం…
Also Read..తన వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న ‘సినీ నటి’
ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్టర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక ఆస్పత్రిలో లూసీ లెట్ బే అనే నర్సు పని చేస్తోంది. అయితే ఈ నర్స్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారులను చంపేస్తుంది అన్న అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లూసీ 2015 వ సంవత్సరం జూన్ నుంచి 2016 జూన్ వరకు కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో నియోనటల్ విభాగంలో పని చేస్తుండేది. అయితే ఆ విభాగంలో ఉన్న ఎనిమిది మంది చిన్నారులను చంపడంతో పాటు, మరో పది మంది పై కూడా హత్యాయత్నం చేసినట్లు తెలిపారు.
Also Read..కర్నూల్ జిల్లాలో ఘోరం.. చిన్నారిపై అత్యాచారం..
చిన్నారులను చంపినందుకు, మిగతా వారిపై హత్యాయత్నం చేసినందుకుగాను ఈమెపై పోలీసులు కేసు నమోదు చెయ్యగా అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అయితే గతంలో కూడా ఈమెపై ఇలాంటి నేరారోపణలు ఉండటంతో పోలీసులు అరెస్టు చేసినప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆమెను విడుదల చేశారు. అయితే ఈ నర్సు పిల్లలను ఎందుకు చంపుతుందన్న విషయం గురించి సరైన కారణాలు తెలియలేదు. కానీ దర్యాప్తు చేస్తున్న పోలీసులు నర్సు పిల్లలు చంపడానికి గల కారణాలు ఏమిటి అన్న కోణంలో విచారిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.