తెలంగాణలోనూ బాణసంచాపై నిషేధం

కరోనా నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్రంలో బాణసంచా కాల్చడం, విక్రయించడం నిషేధించింది. ఆ తరువాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సైతం గాలి తక్కువ ఉన్న ప్రదేశాల్లో బాణ సంచా విక్రయం నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిషా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సంపూర్ణ నిషేధాన్ని ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ప్రకటించకున్నా హరిత టపాసులు కాల్చాలని సూచించారు. తాజాగా తెలంగాణలోనూ బాణసంచా విక్రయం, అమ్మకాలపై నిషేధాన్ని ప్రకటించారు. ఈమేరకు హైకోర్టు గురువారం నిషేధ […]

Written By: Suresh, Updated On : November 12, 2020 2:57 pm
Follow us on

కరోనా నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్రంలో బాణసంచా కాల్చడం, విక్రయించడం నిషేధించింది. ఆ తరువాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సైతం గాలి తక్కువ ఉన్న ప్రదేశాల్లో బాణ సంచా విక్రయం నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిషా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సంపూర్ణ నిషేధాన్ని ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ప్రకటించకున్నా హరిత టపాసులు కాల్చాలని సూచించారు. తాజాగా తెలంగాణలోనూ బాణసంచా విక్రయం, అమ్మకాలపై నిషేధాన్ని ప్రకటించారు. ఈమేరకు హైకోర్టు గురువారం నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. బాణసంచా నిషేధంపై ప్రచారం చేయాలని ఆదేశించింది. అయితే మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యయి.