Monkey pox : కమ్ముకొస్తున్న మంకీ పాక్స్.. ఇవి లక్షణాలు.. దీన్ని ఎలా నివారించాలంటే?

ప్రస్తుతం ఈ వైరస్ తొందరగానే వ్యాప్తి చెందుతుంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఏ చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించిన కూడా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరి మంకీ పాక్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని లక్షణాలు ఏంటి? దీనికి చికిత్స ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 23, 2024 10:02 pm

Monkey pox

Follow us on

Monkey pox : దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదయ్యింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 7వ తేదీన విదేశాల నుంచి వచ్చారు. అతనికి క్లాడ్ 1బీ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. ఇతనికి క్లాడ్ 1బీ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఇద్దరికీ చికిత్స ఇవ్వడంతో ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ అనేది ప్రాణాంతకం. మొదటిసారిగా 1958లో డెన్మార్క్‌లో వచ్చింది. పరిశోధన కోసం తీసుకొచ్చిన కోతుల్లో ఈ వైరస్ బయటపడింది. ఆ తర్వాత 1970లో మానవుల్లో దీనిని గుర్తించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం ఈ వైరస్ తొందరగానే వ్యాప్తి చెందుతుంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఏ చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించిన కూడా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరి మంకీ పాక్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని లక్షణాలు ఏంటి? దీనికి చికిత్స ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

ఈ లక్షణాలు కనిపిస్తే..
మంకీ పాక్స్ వైరస్ ఉన్నవాళ్లలో జ్వరం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, అలసట, కంటిచూపు మందగించడం, కండరాల నొప్పి, వాపు ఎక్కువగా ఉండటం, చీముతో ఉన్న పొక్కులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖమంతా ఈ పొక్కులు వచ్చి శరీరమంతా వ్యాపిస్తాయి. ఈ వైరస్ సోకిన రెండు నుంచి నాలుగు వారాలకు ఈ లక్షణాలు కనిపిస్తాయి. బాడీలో ఏ చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైరస్ తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగి కోలుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి. అయితే ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. దీనిని నివారించడానికి వ్యాక్సిన్ వేస్తారు. మన జీవన అలవాట్లు మార్చితే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఈ వ్యాధి తొందరగా వ్యాప్తి చెందుతుంది.

కరోనా వైరస్ లానే ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. మంకీ పాక్స్ ఉన్నవారిని తాకడం, దగ్గరగా ఉండి మాట్లాడటం, వారి వస్తువులను వాడటం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాబట్టి మంకీ పాక్స్ ఉన్నవారికి దూరంగా ఉండండి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్, గ్లౌజ్‌లు వంటివి వాడాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు స్నానం చేయాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు అసలు వెళ్లకూడదు. ఇది కరోన వైరస్ అంతా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మంకీ పాక్స్ రాకుండా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. మీ జీవన అలవాట్లు ఈ సమస్యను నివారిస్తాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.