https://oktelugu.com/

Whatsapp Chat Theme : నచ్చిన చాట్ థీమ్.. ఇకపై వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో వచ్చే ఈ కొత్త ఫీచర్‌తో అనేక రకాల థీమ్‌లను చాట్‌కు యాడ్ చేసుకోవచ్చు. యూజర్లుకు నచ్చిన రంగులతో దీనిని వాడుకోవచ్చు. ఈ థీమ్ చాట్ ద్వారా ఎవరికి ఏ రంగు నచ్చితే ఆ రంగు పెట్టుకుని వాడవచ్చు. యూజర్లను ఇంకా మెరుగైన ఫీలింగ్ ఇవ్వడానికే ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురానుంది. ఈ థీమ్ చాట్ వల్ల చాటింగ్ స్కీన్ ఇంకా కొత్తగా ఉండటంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 23, 2024 / 09:56 PM IST

    Whatsapp Chat Theme

    Follow us on

    Whatsapp Chat Theme : ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇవి ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. నిజం చెప్పాంటే వాట్సాప్‌ లేనిదే కొన్ని సంస్థల్లో పనులు కూడా జరగవు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వాట్సాప్ వాడుతుంటారు. పొద్దున్న లేచిన నుంచి నిద్రపోయే వరకు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారో కూడా వాళ్లే తెలియదు. అంతా ఒక్కోరు వాట్సాప్‌కి ఎడిక్ట్ అయిపోయారు. అయితే యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. యూజర్లను దృష్టిలో ఉంచుకుని అప్‌డేట్ చేస్తూనే ఉంది. మిగతా యాప్‌లతో పోలిస్తే వాట్సాప్ భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. యూజర్ల భద్రతను బట్టే కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్‌ యూజ్ చేసే వాళ్లకు ఇంకా మంచి సేవలను అందించాలనే ఉద్దేశంతోనే కొత్త కొత్త ఫీచర్లతో టాప్‌లో ఉంటుంది. అయితే వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు రానుంది. యూజర్లకు థీమ్ చాట్ అనే కొత్త ఫీచర్‌తో వస్తోంది. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    వాట్సాప్‌లో వచ్చే ఈ కొత్త ఫీచర్‌తో అనేక రకాల థీమ్‌లను చాట్‌కు యాడ్ చేసుకోవచ్చు. యూజర్లుకు నచ్చిన రంగులతో దీనిని వాడుకోవచ్చు. ఈ థీమ్ చాట్ ద్వారా ఎవరికి ఏ రంగు నచ్చితే ఆ రంగు పెట్టుకుని వాడవచ్చు. యూజర్లను ఇంకా మెరుగైన ఫీలింగ్ ఇవ్వడానికే ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురానుంది. ఈ థీమ్ చాట్ వల్ల చాటింగ్ స్కీన్ ఇంకా కొత్తగా ఉండటంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతుందని వాబీటా ఇన్ఫో తెలిపింది. ఈ థీమ్ చాట్ త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ చాట్ థీమ్ కోసం యూజర్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఎంజాయ్ చేస్తారో లేదో చూడాలి.

    ఈ ఫీచర్‌తో పాటు @ మెన్షన్ ట్యాగ్‌‌ను కూడా వాట్సాప్‌లో తీసుకురానుంది. ఇన్‌స్టాలో స్టోరీ పెట్టినప్పుడు @ ట్యాగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీరు పెట్టే స్టోరీ అవతలి వాళ్లకి నోటిఫికేషన్ వెళ్తుంది. అప్పుడు వాళ్లు స్టోరీ చూస్తారు. ఇలాంటి ఫీచర్‌నే వాట్సాప్‌లో కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ వస్తే.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినప్పుడు మనకి నచ్చిన కాంటాక్ట్‌ను ట్యాగ్ చేసుకోవచ్చు. అయితే మీరు ట్యాగ్ చేసిన పేరు అందరికీ కనిపించదు. మీరు ట్యాగ్ చేసిన వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నచ్చిన వాళ్లకు స్టేటస్ పెట్టాలంటే వాళ్లను మాత్రమే వెళ్లేలా సెలక్ట్ చేస్తారు. వెళ్లకూడదు అనుకునే వారు.. వాళ్లకు మినహాయించి మిగతా అందరికీ పెడుతుంటారు. అయితే ఈ ఫీచర్ వల్ల వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని వాట్సాప్ భావిస్తోంది. మరి ఈ ఫీచర్ ఎప్పుడు నుంచి అందుబాటులోకి వస్తోందో చూడాలి.