Brain Health : రోజువారీ మన పనులు చేసుకోవాలన్నా, జీవితంలో ఏదైనా సాధించాలనే తెలివితేటలు ఉండాలన్నా మెదడు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మానసికంగా అంత సంతోషంగా ఉంటారు. కానీ ఈరోజుల్లో చాలామంది మెదడుకి హాని కలిగిస్తున్నారు. వారి రోజూవారీ అలవాట్ల వల్ల వాళ్లకు తెలియకుండానే మెదడుని డేంజర్‌లో పెట్టేస్తున్నారు. మానవుని జీవితంలో మెదడు ప్రధానపాత్ర పోషిస్తుంది. అలాంటి మెదడుని కాపాడుకోకుండా.. వాళ్ల అలవాట్లతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఒత్తిడి వంటివి లేకుండా సంతోషంగా ఉండాలి. అప్పుడే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే మెదడుని దెబ్బ తీసే కొన్ని హానికర అలవాట్లు ఉన్నాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే మెదడు అంత ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మెదడును దెబ్బతీసే ఆ హానికర అలవాట్లు ఏంటో మరి చూద్దాం.
దీర్ఘకాలికంగా ఒత్తిడి
కొందరు చిన్న విషయానికి ఒత్తిడికి లోనవుతారు. ఇలా దీర్ఘకాలికంగా ఎక్కువ ఒత్తిడికి లోనైతే.. మెదడు ఆరోగ్యం డేంజర్‌లో పడుతుంది. కాబట్టి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు. ఒత్తిడిగా అనిపిస్తే పాటలు వినడం, బయటకు వెళ్లడం, అందరితో సరదాగా గడపడం వంటివి చేస్తే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.
ఎక్కువగా స్క్రీన్ చూడటం
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. కాస్త విశ్రాంతి దొరికితే చాలు.. మొబైల్ లేదా లాప్‌టాప్ చూస్తూనే ఉంటారు. ఇలా చూడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. సరిగ్గా నిద్రపట్టదు. దీంతో మెదడు పనితీరు తగ్గిపోతుంది.
షుగర్ అధికంగా తినడం
చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను అసలు తీసుకోవద్దు. వీటిని అధికంగా తినడం వల్ల ఇన్సులిన్ పెరగడంతో పాటు న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి మెదడు మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి షుగర్ పదార్థాలను కాస్త దూరం ఉంచండి.
హెడ్‌ఫోన్లు ఎక్కువగా వాడటం
కొందరు పాటలు వినడం, ఏవైనా సినిమాలు చూసేటప్పుడు ఎక్కువగా హెడ్ ఫోన్లు వాడుతుంటారు. అందులోనూ తక్కువ సౌండ్‌తో కాకుండా ఎక్కువగా పెట్టి గంటల తరబడి వింటారు. హెడ్‌ఫోన్స్‌ను అధికంగా వాడం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల చెవి లోపల భాగం ఒత్తిడికి గురికావడంతో మెదడు పనితీరు తగ్గిపోతుంది.
నిద్రలేమి
ఎంత ఎక్కువగా నిద్రపోతే.. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తక్కువగా నిద్రపోతే మెదడు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏ విషయాన్ని కూడా సరిగ్గా ఆలోచించలేరు. సరైన సమయానికి పని కూడా పూర్తి చేయలేరు. మెదడుకి హాని కలిగించడమే కాకుండా.. శారీరక సమస్యలకు కూడా కారణం అవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.