దేశంలో ఎక్కువగా వినియోగించే వంటనూనెలలో పామాయిల్ ఒకటనే సంగతి తెలిసిందే. హోటళ్లలో, రెస్టారెంట్లలో ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ఖరీదు కూడా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే పామాయిల్ ఎక్కువగా వినియోగిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం.
పామ్ ఫ్రూట్స్ నుంచి పామాయిల్ ను తయారు చేస్తారు. ప్రస్తుతం లీటర్ పామాయిల్ ధర 130 రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. పామాయిల్ ను వంటకాల్లో ఎక్కువగా వినియోగించడం వల్ల ఫ్యాటి లివర్ మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రెడీ టూ ఈట్ ఫుడ్ ఐటమ్స్ లో ఈ ఆయిల్ ను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. పామాయిల్ లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
పామాయిల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్డియో వాస్క్యూలర్ డిసీజ్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పామాయిల్ వాడటం వల్ల శరీరంలొ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆలివ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, కొబ్బరి నూనెలతో కంపేర్ చేస్తే పామాయిల్ మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పామాయిల్ వల్ల అథెరోస్కిరోసిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆయిల్ లో శాచురేటెడ్ ఫ్యాట్ ఏకంగా 34 శాతం ఉంటుంది. పామాయిల్ తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పామాయిల్ తో చేసిన వంటకాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.