ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మెట్రో సూపర్ మార్కెట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 350 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఏపీఎస్‌ఎస్‌డీసీ ట్విట్టర్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు మంగళగిరి రోడ్డులోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ సూపర్ మార్కెట్ లో పని చేయాల్సి ఉంటుంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఈ నోటిఫికేషన్ ద్వారా సేల్స్ అసోసియేట్స్, క్యాషియర్, జీఆర్, వేర్‌హౌజ్, లాజిస్టిక్స్, కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ ఇతర ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలు 150 ఉండగా కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ పోస్టులు 200 ఉండటం గమనార్హం.
ఏప్రిల్ 20వ తేదీలోగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ పోస్టులకు టూవీలర్ ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.10,000 వేతనంతో పాటు ఆలవెన్సులు లభిస్తాయి.
ఏప్రిల్ 22వ తేదీన ఈ ఉద్యోగాలకు ఇంటర్య్వూలు జరుగుతాయి. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ప్రైవేట్ లిమిటెడ్ మంగళ్‌దాస్ నగర్, గుంటూరులో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.