Teens : ఒకప్పుడు రోజులతో పోలిస్తే.. ఈ తరం పిల్లలు అన్ని విషయాల్లో ముందుంటున్నారు. టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడంతో అందరూ కూడా అప్‌డేట్ చెందుతున్నారు. అయితే చాలామంది ఈరోజుల్లో లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా 15 ఏళ్ల పిల్లలు ఎక్కువగా లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రతి ముగ్గురులో ఒకరు లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. దీనికి ముఖ్య కారణం సురక్షితం లేకుండా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వంటిని తెలిపింది. అసురక్షితంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండని చాలా మంది భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలా సురక్షితం లేకుండా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే లైంగిక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొంతమంది అసురక్షితంగా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల వాళ్లకు దీర్ఘకాలిక లైంగిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి లైంగిక సమస్యలు ఇప్పుడు ఎక్కువగా 15 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లలో కనిపిస్తున్నాయి. తెలిసి, తెలియని వయస్సులో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఎక్కువ శాతం మంది ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇలా చేయడం వల్ల మహిళల్లో ఎక్కువగా క్లామిడియా, గోనేరియా వంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అదే పురుషుల్లో అయితే ఎపిడిడైమస్ వ్యాధికి కారణం అవుతుంది. దీనివల్ల పురుషులు సంతాన సమస్యలను ఎదుర్కుంటారు. అలాగే హెచ్‌ఐవీ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చాలామంది గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం సురక్షితం లేకుండా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.
చాలామంది ఒక్కరితో కాకుండా ఎక్కువమందితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటి వారికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది మీకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి లైంగిక సమస్యల వల్ల అనారోగ్యం క్షీణించడంతో పాటు మానసికంగా కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు. భవిష్యత్తులో మీకు పుట్టే పిల్లలో కూడా ఇవే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి సురక్షితం లేకుండా లైంగిక కార్యకలపాల్లో పాల్గొనవద్దు. అలాగే ఎక్కువమందితో కూడా లైంగికంగా కనెక్ట్ కావద్దు. ఇవి దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు వహించాలి. అప్పుడే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.