Maruti Suzuki eWX : మారుతి కంపెనీ కార్లు అంటే చాలా మంది లైక్ చేస్తారు. ఈ కంపెనీ సెడాన్ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని రకరకాల వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. వివిధ కంపెనీలు చాలా ఈవీలను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. మారుతి నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కారు బయటకు రాలేదు. eVX ను అనౌన్స్ చేసిన మారుతి కంపెనీ దీని అప్డేట్ ఇస్తూ వస్తోంది. వచ్చే ఏడాదిలో దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి నుంచి ఒకటి కాకుండా దాదాపు మూడు కార్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వాటి వివరాల్లోకి వెళితే..
పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వినియోగదారుల అవసరాలను బట్టి ఆయా ఫీచర్లతో వస్తున్నాయి. కానీ మారుతి నుంచి ఈవీలు అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన eVX గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. రెండు సంవత్సరాల కిందటే ఈ కారు గురించి అనౌన్స్ చేవారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో లో ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మిగతా కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. హరిజెంటల్ ఎల్ ఈడీడీ లైట్లను కలిగిన దీనికి ర్యాక్ట్ ఫ్రంట్ విండ్ షీల్డ్, స్క్వేర్డ్ ఆఫ్ వీల్స్, వార్ప్ హిడెన్ మస్కులర్ సైడ్ క్లాడింగ్ ఉండనుంది.
ఇదే కంపెనీ నుంచి YMC MPV రాబోతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఎంపీవీ. ఇది ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న ఎలక్ట్రిక్ కారు. ఈవీఎక్స్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉన్న దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. 2026లో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. కుదరకపోతే 2027 కచ్చితంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే మారుతి కంపెనీ నుంచి మూడో ఈవీ eWX రాబోయే అవకాశం ఉంది. దీనిని ఇప్పటికే బ్యాంకాక్ మోటార్ షో లో ప్రదర్శించారు. డిజైన్ పెటేంట్ ను ఇప్పటికే భారత్ లో రిజిస్టర్ చేశారు. ఇది వ్యాగన్ ఆర్ ను పోలిన ఎలక్ట్రిక్ కారు వలె ఉంటుంది. సుజుకీ ఈడబ్ల్యూ ఎక్స్ ప్రాథమిక కీ కారుగా పనిచేస్తుంది. దీనిని ఫుల్ చార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకే వెళ్తుంది. టయోటా 27 పీఎల్ ప్లాట్ ఫాంపై ఆధారపడి పనిచేస్తున్న దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని రూ. 10 నుంచి 12 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈవీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి నుంచి మూడు ఈవీలు రావడం ఆసక్తిగా మారింది. అయితేఇప్పటి వరకు సక్సెస్ అయిన కార్ల మాదిరిగానే కొత్త ఈవీలు ఆకట్టుకుంటాయా? లేదా? చూడాలి.