Sun bath therapy : ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంతటి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్న కూడా ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రోజంతా ఇంట్లోనే, ఏసీలో ఉంటూ సేద తీరుతున్నారు. కనీసం గంట కూడా సూర్యరశ్మిలో ఉండట్లేదు. సూర్యకాంతి నుంచి విడుదల అయ్యే విటమిన్ డి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామందికి సన్ బాత్ గురించి పెద్దగా తెలియదు. రోజూ కాకపోయిన అప్పుడప్పుడు సన్ బాత్ చేస్తుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ సన్ బాత్ అంటే ఏంటి? అసలు ఏ సమయంలో ఈ సన్ బాత్ చేయాలి? ఎంత టైమ్ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూర్యకాంతిలో కొంత సమయం ఉండటాన్నే సన్ బాత్ అంటారు. రోజూ ఈ బాత్‌ను చేయడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యకాంతి నుంచి వెలువడే విటమిన్ డి మనకి తాకినప్పుడు బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సూర్యకాంతి నుంచి వచ్చే విటమిన్ డి కాల్షియంను గ్రహించడంలో సాయపడుతుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉండేలా సాయపడుతుంది. అలాగే ఎముకల సాంద్రతను పెంచడంతో పాటు ఎముక పగుళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఈ సన్ బాత్‌ను రోజుకి 15 నుంచి 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి తగినంత విటమిన్ డి అందడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. వచ్చిన తట్టుకునే సామర్థ్యం సన్ బాత్ కల్పిస్తుంది. అయితే ఈ సన్ బాత్‌ను ఒక లిమిట్లో మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువగా చేస్తే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
సన్ బాత్‌ను ఎక్కువ సేపు చేయకూడదు. ఎవరైనా గంట కంటే ఎక్కువగా సూర్యకాంతిలో ఉంటే శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి చేసే సామర్థ్యం గరిష్ఠ స్థాయికి వెళ్తుంది. దీనివల్ల మీరు సూర్యరశ్మి తీసుకున్న ప్రయోజనం ఉండదు. గంట కంటే ఎక్కువ సమయం ఉంటే చర్మానికి హాని కలుగుతుంది. కొన్నిసార్లు చర్మక్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది. అయితే సన్ బాత్‌ను వేసవిలో చేయకపోవడం మంచిది. ఈ సన్ బాత్‌ను చేస్తే చాలు ఆరోగ్యం బాగుంటుందని అనుకోవద్దు. దీనితో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అలాగే సన్ బాత్ వల్ల బద్దకం పోతుంది. అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గి రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. శారీరక ఆరోగ్యం కుదుటపడటంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. కాబట్టి రోజుకి కనీసం పది నిమిషాలైన సన్ బాత్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: What are the benefits of sun bath therapy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com