Zodiac Signs: కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.. ఆ రాశుల వాళ్లు కట్టుకోకూడదట!

Zodiac Signs: ఈ మధ్య కాలంలో చాలామంది కాలికి నల్ల దారం కట్టుకుని కనిపిస్తున్నారు. ఒకప్పటి ఆచారం అయిన నల్లదారంను నేటితరం వాళ్లలో కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. నల్లదారం కట్టుకోవడం వల్ల మనపై నెగిటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు. దిష్టి, చెడు శక్తులు మనపై ప్రభావం చూపకుండా ఉండాలనే ఆలోచనతో ఎక్కువమంది నల్లదారం కట్టుకుంటారు. అయితే కొన్ని రాశుల వాళ్లు నల్లదారం కట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. తులారాశి, కుంభ రాశి, ధనస్సు […]

Written By: Navya, Updated On : April 19, 2022 5:38 pm
Follow us on

Zodiac Signs: ఈ మధ్య కాలంలో చాలామంది కాలికి నల్ల దారం కట్టుకుని కనిపిస్తున్నారు. ఒకప్పటి ఆచారం అయిన నల్లదారంను నేటితరం వాళ్లలో కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. నల్లదారం కట్టుకోవడం వల్ల మనపై నెగిటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు. దిష్టి, చెడు శక్తులు మనపై ప్రభావం చూపకుండా ఉండాలనే ఆలోచనతో ఎక్కువమంది నల్లదారం కట్టుకుంటారు. అయితే కొన్ని రాశుల వాళ్లు నల్లదారం కట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

తులారాశి, కుంభ రాశి, ధనస్సు రాశి వాళ్లు నల్లదారం కట్టుకోవడం వల్ల అనుకూల ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మేష రాశి, వృశ్చిక రాశి వాళ్లు నల్లదారం కట్టుకుంటే మాత్రం చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశులపై అంగారకుని ప్రభావం ఉండటంతో పాటు అంగారకునికి నలుపు రంగు నచ్చదు కాబట్టి నల్ల దారం ధరించడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

Also Read: Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే ఎంట్రీ ఖాయ‌మైన‌ట్టేనా.. అప్పుడే భగ్గుమంటున్న సీనియ‌ర్లు..

గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ బ్రహ్మ కాలంలో కాలికి నాలుగు ముడులు వేసిన నల్లతాడును ధరించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. శనివారం రోజున నల్లదారం ధరిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం రోజున నల్లదారం ధరించడం వల్ల మనపై శనీశ్వరుని కటాక్షం ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నలుపు రంగు పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రంగు కావడం గమనార్హం. ఇప్పటికే పసుపు తాడు, ఎరుపు తాడును ధరించిన వాళ్లు నల్ల దారం ధరించకపోతే మంచిదని చెప్పవచ్చు. నల్ల దారం ధరించడంలో ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.

Also Read: Acharya Pre Release Event: ఆచార్య ముఖ్య అతిది గా తమ్ముడు – సంతోషంలో మెగా ఫ్యాన్స్ !

Recommended Videos: