Acharya Pre Release Business: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సహజంగానే మెగా హీరోల సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక ‘ఆచార్య’ లాంటి సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వైజ్ గా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.
Also Read: Acharya Pre Release Event: ఆచార్య ముఖ్య అతిది గా తమ్ముడు – సంతోషంలో మెగా ఫ్యాన్స్ !
నైజాం 47 కోట్లు
సీడెడ్ 29 కోట్లు
ఉత్తరాంధ్ర 8 కోట్లు
ఈస్ట్ 6 కోట్లు
వెస్ట్ 6 కోట్లు
గుంటూరు 6.5 కోట్లు
కృష్ణా 5 కోట్లు
నెల్లూరు 4.5 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఈ సినిమాకి 110 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 18 కోట్లు,
ఓవర్సీస్ 33 కోట్లు,
ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 151 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
సైరా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా ఇమేజ్ కూడా పడింది. కాబట్టి, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో నలభై కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ఆచార్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 192 కోట్లు జరిగింది.
కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం ఈ చిత్రం 193 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి. అలాగే, 470 కోట్ల నుంచి 480 కోట్ల దాకా గ్రాస్ ను రాబట్టాల్సి ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందో ? ఈ చిత్రం ఏ రేంజ్ జాతర చేస్తుందో చూడాలి.
Also Read: Natural Star Nani: స్టార్ డైరెక్టర్ కి హీరో నానీ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended Videos: