Arjun S/O vyjayanthi : కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O vyjayanthi) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు మూవీ టీం ఇచ్చిన హైప్ మామూలుది కాదు. జూనియర్ ఎన్టీఆర్ అయితే చివరి 30 నిమిషాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనంత ఎమోషనల్ గా ఉంటుందని లేపి వదిలాడు. తీరా చూస్తే అక్కడేమి లేదు. చాలా మామూలు కమర్షియల్ సినిమా. దీనికి కళ్యాణ్ రామ్ మొదటి వారం లోపే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని సక్సెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇక విజయశాంతి అయితే ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మూవీ టీం అంతలా బిల్డప్ ఇచ్చిన ఈ సినిమా క్లోజింగ్ లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read :
ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని ఒకసారి పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 22 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 9 కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే దాదాపుగా 13 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు, అసలే బిజినెస్ లేక ట్రేడ్ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సినిమా కొట్టిన దెబ్బ మామూలుది కాదు. వారం రోజుల్లోపు బ్రేక్ ఈవెన్ అవ్వుధి అంటూ చెప్పుకొచ్చిన కళ్యాణ్ రామ్, మళ్ళీ ఈ సినిమా ఊసే ఎత్తలేదు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి కేవలం రెండు కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో కోటి 20 లక్షలు, ఆంధ్ర లో 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్ + కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి ఈ చిత్రానికి దాదాపుగా కోటి రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి అన్ని కలిపి 9 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆడియన్స్ రొటీన్ కమర్షియల్ సినిమాలను ఛీ కొడుతున్నారని అనుకోవాలి. కనీసం కన్నెత్తి కూడా ఆ సినిమాల వైపు చూడడం లేదు. కేవలం కథలో కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతున్నారు. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా చతికిల పడాల్సిందే. ఇక కళ్యాణ్ రామ్ లాంటి మీడియం రేంజ్ హీరో సినిమాలు అయితే డబుల్ డిజిట్ షేర్ కి కూడా నోచుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read : అభిమానులంటే ‘హరి హర వీరమల్లు’ టీంకి ఇంత చులకన ఎందుకు?