Hair Loss Prevention: ఈ తరంలో జుట్టు సమస్య సర్వసాధారణం అయిపోయింది. అయితే, వెంట్రుకల కోసం అద్భుతమైన తైలం అందుబాటులోకి వచ్చింది. మన వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, అలాగే చిట్లిపోకుండా, రాలకుండా ఉండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్టంగా ఉండడానికి, అన్నిటికి కంటే ముఖ్యంగా చుండ్రు సమస్య పోవడానికి ఈ తైలం చాలా బాగా పని చేస్తోంది.
మరి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి ఆ తైలం చేయు విధానం :
పచ్చి గుంటగలగర ఆకు రసం లీటర్
పచ్చి ఉసిరికాయల రసం లీటర్
పచ్చి గోరింటాకు రసం లీటర్
పచ్చి నీలి ఆకుల కషాయం లీటర్
పచ్చి మందారపువ్వుల రసం లీటర్
గురు గింజల కషాయం లీటర్
కరక్కాయల కషాయం లీటర్
మామిడికాయ జీడి రసం లీటర్
తెల్ల ఉల్లిగడ్డ రసం లీటర్
మర్రి ఊడల కషాయం లీటర్
లోహ భస్మం 1/4 kg
ఈ పై చెప్పిన వస్తువులు అన్నీ మహా శక్తివంతమైనవి. పై వాటిని పచ్చిగా ఉన్నప్పుడే బాగా దంచి రసం తీసుకోవాలి
మరి ఆ రసాన్ని తైలంగా చేయడం ఎలా ?
Also Read: సమంత ఛాలెంజ్.. చేతులేత్తేసిన బాయ్ ఫ్రెండ్..!
.
ఇలా చెప్పినవన్నీ మంచి నాణ్యమైన వాటిని తీసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్ల నువ్వుల నూనె, 5 లీటర్లు వేసుకొని సన్నని మంట పైన కాచి, పై చెప్పిన కషాయాలు రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపోసి, ఈ నూనె ని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ఈ నూనె 2, 3 లీటర్లు మీకు మిగలవచ్చు. అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకుని మెల్లగా 5 నిమిషాలు మర్దన చేయాలి, ఆ తర్వాత శీకాకాయ 100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి కలిపి తల స్నానం చేయాలి. ఇక మీ జుట్టుకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి.
Also Read: రెడీ అంటున్న త్రిష.. త్వరగానే కోలుకుంది !