Wallet Tips For Money: నేటి కాలంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ పని చేయాలన్నా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో ఇంటిలో ఏ చిన్న పని అయినా దాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుని చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తు ప్రకారం చూసుకుంటే పర్సుకు కూడా వాస్తు పాటించాల్సిందే. పర్సును ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదట. అందులో కనీసం ఓ వెండి నాణెం లేదా రూపాయి బిళ్ల అయినా ఉంచుకోవాల్సిందే. పర్సులో ఎల్లప్పుడు డబ్బులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పర్సును కూడా వాస్తు ప్రకారం ఎలా ఉంచుకోవాలో సూచిస్తున్నారు. పర్సులో ఏది పడితే అది పెట్టుకోకూడదు. మనకు డబ్బులు వచ్చే మార్గాల కోసం పర్సులో వేటిని ఉంచుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ధనలక్ష్మి మన ఇంటిలో తిష్ట వేసేందుకు పర్సును కూడా వాస్తు ప్రకారం ఉంచుకోవాల్సిందే. గడువు ముగిసిన కార్డులు, బిల్లులు పెట్టుకోకూడదు. అవసరం లేని వస్తువులను పర్సులో పెట్టుకోకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనకరం అని తెలుసుకోవాలి.
Also Read: Nagarjuna: నాగార్జునకు పైసలే ముఖ్యం పరువు కాదు…!
వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో లక్ష్మిదేవి ఫొటో ఉంచుకోవాలి. ఇంకా శ్రీ చక్రం పెట్టుకోవాలి. లక్ష్మిదేవి కూర్చున్న ఫొటో పెట్టుకుంటే మంచిది. పర్సులో ఏవి పడితే అవి పెట్టుకోకూడదు. పర్సులో పనికొచ్చే వస్తువులనే ఉంచుకోవాలి. అనవసరమైన వాటిని పర్సులో పెట్టుకుంటే అనర్థాలే వస్తాయి. కానీ పర్సును వాస్తు ప్రకారం చూసుకుంటే పర్సును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సురక్షితమైన ప్రాంతంలోనే ఉంచుకుంటే మనకు ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

పర్సుల కలర్లలో కూడా ఇష్టమొచ్చిన కలర్ వాడకూడదు. వాలెట్ లేదా నలుపు రంగు పర్సులు మాత్రమే వాడాలి. ఎరుపు, నీలి రంగు మాత్రం వద్దని తెలుస్తోంది. పర్సులో తామర గింజలు, 21 బియ్యపు గింజలను ఉంచుకుంటే మేలు కలుగుతుంది. రూ.20 ల నోట్లు ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం పర్సును జాగ్రత్తగా ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. కానీ ఏవో ఇష్టారీతిగా పర్సును ఉంచుకుంటే వ్యతిరేక ఫలితాలే వస్తాయని తెలుస్తోంది. అందుకే పర్సును కూడా మనం బాగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది.
Also Read:Chanakya Niti On Success: చాణక్య నీతి: తెలివైన వ్యక్తులకు ఈ అలవాట్లు.. విజయం వీరికే సొంతం

