Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: నాగార్జునకు పైసలే ముఖ్యం పరువు కాదు...!

Nagarjuna: నాగార్జునకు పైసలే ముఖ్యం పరువు కాదు…!

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జునపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి నాకు పైసలే ముఖ్యమని ముందుకు వెళుతున్నారు. వరుసగా నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించి రికార్డు సృష్టించనున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు చక్కర్లు కొడుతున్నాయి. కింగ్ నాగార్జున ఆసక్తికర ప్రోమోలతో ఆడియన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. లైఫ్ లో ఎలాంటి మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటున్నారు. లేటెస్ట్ సీజన్ వచ్చేస్తుందని బిగ్ బాస్ ప్రేమికులు సంబరపడిపోతున్నారు.

Nagarjuna
Nagarjuna

మరోవైపు ఈ షో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చాలా కాలంగా సాంప్రదాయవాదులు, ఓ వర్గం ప్రేక్షకులు బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఓ అసభ్యకర రియాలిటీ షోగా అభివర్ణిస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే ఇంటిలో ఉండటం, వాళ్ళ మధ్య రొమాన్స్, ప్రేమలు, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ విమర్శల పాలవుతుంది. ఇలాంటి షోస్ కచ్చితంగా సమాజానికి కీడు చేస్తాయని వారు భావిస్తున్నారు. భారతీయ సంస్కృతికి విరుద్ధమైన బిగ్ బాస్ షో ప్రసారం నిలిపివేయాలని డిమాండ్ ఎప్పటి నుండో వుంది.

Also Read: Puri Jagannath : పూరి జగన్నాథ్.. ఆడు మగాడ్రా బుజ్జీ!

ఒకటి రెండు సందర్భాల్లో హోస్ట్ నాగార్జునను హెచ్చరించారు. ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు.నాగార్జున లాంటి పాప్యులర్ స్టార్ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నాగార్జునకు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదు. వరుసగా సీజన్స్ చేసుకుంటూ పోతున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే చేసే షో కోసం నిర్వాహకులు కోట్లు కుమ్మరిస్తున్నారు. షో స్క్రిప్టెడ్ అనే ఆరోపణలు ఉండగా.. శని, ఆదివారాల్లో నాగార్జున ఎవరిని, ఎలాంటి ప్రశ్నలు వేయాలో… ఎవరిని ఎత్తాలో ఎవరిని తొక్కాలో ముందుగానే నిర్వాహకులు చెబుతారు.

పెద్దగా కష్టపడకుండా భారీగా రెమ్యూనరేషన్ నాగార్జున దక్కుతుంది. ఒళ్ళు హూనం చేసుకొని నెలల పాటు షూటింగ్స్ లో పాల్గొన్నా రాని డబ్బులు బిగ్ బాస్ షోతో దక్కుతున్నాయి. అందుకే ఆయన సాంప్రదాయాలు, సిద్ధాంతాలు పట్టించుకోవడం లేదు. విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనకు నచ్చింది చేసుకుపోవడమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన్ని అభిమానించేవారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్,నాని తర్వాత ఆ బాధ్యత తీసుకున్న నాగార్జున సమర్థవంతంగా నిర్వహిస్తూ సక్సెస్ ఫుల్ హోస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.

Nagarjuna
Nagarjuna

Also Read:Liger Story Leaked: లీక్ అయిన లైగర్ కథ.. ఇటు బిజినెస్ లోనూ విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు !

 

సమంత ఇంట్లో గొడవలు || Quarrels In Samantha House || Samantha || Oktelugu Entertainment

 

ఆ విషయంలో పూరి జగన్నాథ్ నిజంగా గ్రేట్ || Puri Jaganadh Revels About Relation With Charmi || Liger

 

నాగార్జునకు పైసలే ముఖ్యం పరువు కాదు | Criticisms Are Coming On Nagarjuna | Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version