వ్యాక్సిన్ వచ్చినా కరోనా వైరస్ అదుపులోకి రాదా..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభిస్తున్నా త్వరలో వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి చాలా డేంజర్..? ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో కరోనాను […]

Written By: Navya, Updated On : December 4, 2020 11:08 am
Follow us on


ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభిస్తున్నా త్వరలో వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి చాలా డేంజర్..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. అయితే పెరుగుతున్న కేసులను పూర్తిస్థాయిలో కట్టడి చేయడం మాత్రం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజలు వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చేవరకు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సామాజిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Also Read: వారికి కరోనా సోకదు.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ మైక్ వ్యాన్ మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో తయారయ్యే వ్యాక్సిన్లు రోజురోజుకు పెరుగుతున్న కరోనా కొత్త కేసులను, కరోనా మరణాలను ఆపలేకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల పైబడిన వారు మాస్కును తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇంటి నుంచి బయటకు వచ్చారంటే తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తే మంచిదని పేర్కొంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నిబంధనలు పాటించకుండా ఉంటే వైరస్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు జనవరి తొలి వారానికి కరోనా వ్యాక్సిన్ భారత్ లో అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. కేంద్రం వ్యాక్సిన్ ప్రాధాన్యతల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టేందుకు సిద్ధమవుతోంది.