రేవంత్ రెడ్డికే టీపీసీసీ.. ముహుర్తం ఖరారైందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కొన్నేళ్లపాటు ఏకచత్రాధిపత్యంతో పాలించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలోె గల్లీ స్థాయికి పడిపోయినట్లుగా కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చాం.. మేమేం తెచ్చాం.. అని చెప్పుకునే కాంగ్రెస్ సీనియర్ నేతలు కనీసం తమ సొంత నియోజకవర్గంలోనూ సత్తా చాటలేక చతికిలపడి పోతున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు అధాన్నంగా మారిపోతుంది. Also Read: కేసీఆర్ ఇచ్చాడు.. నువ్వు ఎందుకు ఇవ్వవు జగన్: పవన్ తెలంగాణ రాష్ట్రం […]

Written By: Neelambaram, Updated On : December 3, 2020 8:29 pm
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కొన్నేళ్లపాటు ఏకచత్రాధిపత్యంతో పాలించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలోె గల్లీ స్థాయికి పడిపోయినట్లుగా కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చాం.. మేమేం తెచ్చాం.. అని చెప్పుకునే కాంగ్రెస్ సీనియర్ నేతలు కనీసం తమ సొంత నియోజకవర్గంలోనూ సత్తా చాటలేక చతికిలపడి పోతున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు అధాన్నంగా మారిపోతుంది.

Also Read: కేసీఆర్ ఇచ్చాడు.. నువ్వు ఎందుకు ఇవ్వవు జగన్: పవన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఆ స్థాయిలో మెప్పించలేకపోతుంది. కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఎప్పుడో అక్యూపై చేసింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంతో చూపించింది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అవుతోంది. హూజుర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందనే ప్రచారం జరిగింది. నాడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చేయాలని భావించడంతో పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించినట్లు సమాచారం. బహిరంగంగానే పలువురు నేతలు రేవంత్ రెడ్డి పీసీసీ ఇవ్వొద్దని కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ల వ్యతిరేకత నేపథ్యంలో కొన్నిరోజులు టీపీసీసీపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే టీపీపీసీని మారుస్తానని ప్రచారం జరిగినా అది జరుగలేదు. రేవంత్ కే టీపీపీసీ దక్కుతుందనే పార్టీలోని సీనియర్లకు సమాచారం ఉండటంతో కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీలో పెద్దగా ప్రచారం చేయలేదని టాక్ విన్పిస్తోంది. దీంతో రేవంత్ తన నియోజకవర్గంలోని డివిజన్లలో ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు ఒంటరిపోరు చేశాడు.

Also Read: గ్రేటర్లో అంతుచిక్కని ఓటరు నాడి.. టెన్షన్లో నేతలు..!

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్.. బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ను మళ్లీ గాడినపెట్టేందుకు టీపీపీసీని మార్చాలని అధిష్టానం భావిస్తోంది. సీఎం కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కొనే సత్తా ఉన్న రేవంత్ రెడ్డికే టీపీసీసీ కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈమేరకు డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజున టీపీసీసీగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే ఒకటైనట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం రేవంత్ రెడ్డికే టీపీసీసీ కట్టబెడితే ఆపార్టీలోని సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్