వేర్వేరు కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 13 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరిగింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో కరోనా మహమ్మారి అంతమయ్యే అవకాశాలు సైతం ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతుందనే సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొత్తకొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా […]

Written By: Navya, Updated On : June 21, 2021 9:22 pm
Follow us on

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 13 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరిగింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో కరోనా మహమ్మారి అంతమయ్యే అవకాశాలు సైతం ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతుందనే సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా కొత్తకొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా కొత్తరకం కరోనా వైరస్ లకు సులభంగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలలో ఒకరైన సౌమ్యా స్వామినాథన్ వేర్వేరు కరోనా వ్యాక్సిన్లు కొత్తరకం కరోనా వేరియంట్లపై బాగా పని చేస్తాయని వెల్లడించారు. ఇప్పటికే ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చిన దేశాలు రెండో డోసుగా వేరే వ్యాక్సిన్ ఇస్తే మంచిదని సూచనలు చేశారు.

అయితే రెండు రకాల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లలో సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అదే సమయంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందడంతో పాటు కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్తకణాలు సైతం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని తెలుస్తోంది. మరోవైపు కొన్ని దేశాలు బూస్టర్ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

సౌమ్యా స్వామినాథన్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే కరోనా వైరస్, వ్యాక్సిన్లకు సంబంధించిన శాస్త్రపరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సమయంలో బూస్టర్ డోస్ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.