ఆధార్‌కు రూ.200.. పాన్‌కు రూ.500.. కొత్తరకం మోసం..?

విశాఖపట్నం జిల్లాలోని పెదగంట్యాడ కొంతమంది వ్యక్తులు ఆధార్ కార్డ్ నంబర్ చెల్లి వేలిముద్ర వేస్తే 200 రూపాయలు, పాన్ కార్డ్ నంబర్ చెప్పి వేలిముద్ర వేస్తే 500 రూపాయలు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పేదలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి కొందరు వాళ్లకు తెలియకుండా వాళ్ల పేర్లతో సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. హార్బర్‌ ఏసీపీ శ్రీరాముల శిరీష తెలిపిన […]

Written By: Navya, Updated On : June 21, 2021 9:42 pm
Follow us on

విశాఖపట్నం జిల్లాలోని పెదగంట్యాడ కొంతమంది వ్యక్తులు ఆధార్ కార్డ్ నంబర్ చెల్లి వేలిముద్ర వేస్తే 200 రూపాయలు, పాన్ కార్డ్ నంబర్ చెప్పి వేలిముద్ర వేస్తే 500 రూపాయలు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పేదలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి కొందరు వాళ్లకు తెలియకుండా వాళ్ల పేర్లతో సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేశారు.

హార్బర్‌ ఏసీపీ శ్రీరాముల శిరీష తెలిపిన వివరాల ప్రకారం కొవిరి జగన్నాథం, జానకి రామిరెడ్డి, బండియ్య, కొవిరి నాని అనే వ్యక్తులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వర్తింపజేస్తామని పేదలకు మాయమాటలు చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు ఉన్నవాళ్ల వివరాలను సేకరించి వారితో వేలిముద్ర వేయించి డబ్బులు ఇవ్వడం మండలంలో సంచలమైంది. కొత్తపట్నంలో సెల్ షాపు నడుపుతున్న కొవిరి నాని ఒక కంపెనీ సిమ్ కార్డులను డిస్ట్రిబ్యూట్‌ చేస్తుంటాడు.

అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించిన ఆ వ్యక్తి కొత్తరకం మోసానికి తెరలేపాడు. పేదలకు డబ్బులు ఇప్పించి వారి ఆధార్, పాన్ కార్డులతో సిమ్ లను ఎక్కువధరకు అమ్ముకునేలా పథకం రచించాడు. ఆన్ లైన్ రమ్మీ ఆడేవాళ్ల కోసం ఈ సిమ్ లను అమ్మాలని ప్లాన్ చేయగా కొంతమంది వ్యక్తులు 100 నంబర్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

న్యూపోర్టు పోలీసులు వారు ఉన్న స్థలానికి చేరుకుని కొవిరి జగన్నాథంను శనివారం అదుపులోకి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.