ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు పెళ్లి కాని మగాళ్లకు కరోనా ముప్పు ఎక్కువని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆదాయం ఎక్కువ లేని, చదువుకోని, పెళ్లి కాని వాళ్లే కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని చెబుతున్నారు. కరోనా మరణాల్లో కూడా పెళ్లి కాని మగాళ్లే ఎక్కువగా ఉన్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
Also Read: కరోనా భయం వల్ల తెగ తాగేస్తున్న ప్రజలు.. ఏమిటంటే..?
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు 20 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్టు గుర్తించామని చెబుతున్నారు. ఎవరైతే ఒంటరి జీవితం గడుపుతారో వాళ్లు తక్కువ రక్షణతో ఉంటారని తెలిపారు.
పెళ్లి చేసుకున్న వాళ్లలో కరోనా సోకినా మరణం ముప్పు తక్కువగా ఉందని.. వీళ్లు ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారని తెలిపారు. పెళ్లి కాని మహిళలతో పోలిస్తే పురుషులు 2 రెట్లు ఎక్కువగా చనిపోయారని.. పురుషుల ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
Also Read: పేపర్ కప్పులలో టీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?
వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ తప్పనిసరిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఐతే కనిపిస్తున్నాయి, శాస్త్రవేత్తలు కరోనాపై సమర్థవంతంగా పని చేసే మరికొన్ని మందులను గుర్తించే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.