Site icon OkTelugu

తెలంగాణలో కొత్తగా 1,267 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,267 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,267 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,52,455 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,385గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,32,489 మంది కోలుకోగా ప్రస్తుతం 18,581 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 15,794 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.

Exit mobile version