ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వాళ్లను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోనుంది. 2020 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి ఎంబీబీఎస్ డిగ్రీతో ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన కాలేజీలలో చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 సంవత్సరం డిసెంబర్ 1 నాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకుంటే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లకు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో 75 శాతం, గతంలో పని చేసిన అనుభవానికి 15 శాతం, ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఏడాది నుంచి సంవత్సరానికి ఒక శాతం చొప్పున మార్కులను యాడ్ చేస్తారు. కర్నూలు, కృష్ణా జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లా అభ్యర్థులు మాత్రం ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాను బట్టి దరఖాస్తు ఫీజులలో మార్పులు ఉంటాయి.
నెల్లూరు జిల్లా అభ్యర్థులకు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 20వ తేదీ చివరి తేదీగా ఉంది. కృష్ణా జిల్లా అభ్యర్థులకు డిసెంబర్ 21, కర్నూలు జిల్లా అభ్యర్థులకు డిసెంబర్ 22 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అనుభవాన్ని బట్టి ఎంపికైన ఉద్యోగులకు వేతనాల్లో మార్పులు ఉంటాయి.