హెల్త్‌సౌత్ ఇండియా టాప్ హెయిర్ సర్జన్ ‘డాక్టర్ జాన్ వాట్స్'తో ...

సౌత్ ఇండియా టాప్ హెయిర్ సర్జన్ ‘డాక్టర్ జాన్ వాట్స్’తో ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రస్తుత సమాజంలో   ప్రతి మనిషి ఎదుర్కొంటున్న సర్వసాధారణమైన  సమస్య  ‘బట్టతల’.  అయితే,  బట్టతల బాధితులకు,  అన్ని రకాల  జుట్టు సమస్యలకు ఏకైక  పరిష్కారం ‘ట్రైకోస్’.  సౌత్ ఇండియాలోనే  టాప్ హెయిర్ సర్జన్,  గోల్డ్ మెడలిస్ట్  ‘డాక్టర్: జాన్ వాట్స్’ గారు  తన దగ్గరికి  జుట్టు సమస్యలతో  వచ్చిన వారి   కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నారు.  బట్టతల బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

 

జాన్ వాట్స్ గారు   స్థాపించిన  ‘Trichos Hair Transplant and Research Center’  సౌత్ ఇండియాలోనే  ‘బెస్ట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవార్డ్’  అందుకుంది.  ఇప్పటి వరకు  ఒక సీనియర్ సర్జన్ గా  ‘డాక్టర్ జాన్ వాట్స్’  పదిహేడు  వందలకు పైగా  హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను  వందశాతం సక్సెస్ ఫుల్ గా  పూర్తి  చేశారు.  ఈ సందర్భంగా  డాక్టర్  జాన్ వాట్స్ గారితో ప్రత్యేక  ఇంటర్వ్యూ. 

 

 యాంకర్ : నమస్కారం డాక్టర్ గారు.  అసలు  బట్టతలకు పరిష్కారం ఏమిటి ?   
 
జాన్ వాట్స్ :   బట్టతలకు సరైన శాశ్విత పరిష్కారం ‘హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్’.  ఈ  సర్జరీ ప్రాసెస్ లో  రూట్స్ తో సహా  పెర్మనెంట్ జోన్ నుంచి హెయిర్ తీసుకుని ఎక్కడైతే బట్టతల  ఉంటుందో  ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాము. ఆ హెయిర్ లైఫ్ లాంగ్  ఉంటుంది. 
 
 
యాంకర్ : మరి,  ఇంప్లాంట్ చేసినట్లు  ఆ హెయిర్ తెలిసిపోయే ఛాన్స్ ఉండదా ? 
 
జాన్ వాట్స్ : క్వాలిఫైడ్ అండ్ ఎక్స్ పీరియన్స్  సర్జన్ గానీ  ఇంప్లాంట్ చేస్తే..   ఆ హెయిర్,  న్యాచురల్ హెయిర్ లానే ఉంటుంది.   హెయిర్ కట్ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు,  హెయిర్ ను  నచ్చినట్టు స్టైల్ గా కూడా చేసుకోవచ్చు.           
 
యాంకర్ : కానీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్  అనేది ప్రముఖులకు తప్ప..  సామాన్యులకు అందని ద్రాక్ష అని చాలామందికి  డౌట్ ఉంది ?
 
జాన్ వాట్స్ : అది అపోహ మాత్రమే.  అవసరమైన అతి సామాన్యుడికి కూడా  ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అందుబాటులో ఉంది.  ఎవరైనా  ఖర్చు పెట్టే విధంగానే ట్రాన్స్ ప్లాంటేషన్ చార్జెస్ ఉన్నాయి.  
యాంకర్ : అలాగే,  సర్జరీ చేయించుకున్నాక,  రిజల్ట్స్ వస్తోందో రాదో  అనే అనుమానం కూడా ఎక్కువమందికి ఉంటుంది ? 
 
జాన్ వాట్స్ :   కచ్చితంగా విజుబుల్ రిజల్ట్స్ వస్తాయి.  ట్రాన్స్ ప్లాంటేషన్  తర్వాత వచ్చే  ఆ జుట్టు చాల సహజంగా కూడా ఉంటుంది.  ఒత్తుగా ఉన్న ఆ హెయిర్ లో నుండి గాలి పాస్ అయినప్పుడు   ఆ ఫీల్ ని  మీరు ఫీల్ అవ్వొచ్చు.  సో.. రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తోంది.    
 
 

యాంకర్ :  అసలు ఈ బట్టతల ఎందుకు వస్తోంది సర్ ? 
 
జాన్ వాట్స్ :   వంశపార్యపరంగా,  ‘డి హెచ్ టి’ హార్మోన్ ఇన్ వాల్వ్ మెంట్  ఎవరికైతే ఉంటుందో వారికీ  బట్టతల వస్తోంది.  ఈ  ‘డి హెచ్ టి’ హార్మోన్ నుండి వచ్చే సిగ్నల్స్ వల్ల  తల ముందు భాగంలో  ఉండే హెయిర్ రాలిపోతుంది. కొంతమందికి సైడ్స్ లో  రాలిపోతుంది.  మరి కొంతమందికి పైన రాలిపోతుంది. ఇలా ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు హెయిర్ ఫాల్ అవుతుంది.        
 
యాంకర్ :  మీరు 1700 పైగా  సర్జరీలు చేసిన టాప్ సర్జన్.  ఈ  జుట్టు సమస్యల పై ప్రజలలో తగిన అవగాహన పెంపొందిస్తే బాగుంటుంది సర్ ?      
జాన్ వాట్స్ :   ఆ ఉద్దేశ్యంతోనే    ద నేకేడ్ ట్రూత్ ఎబౌట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్   (The Naked Truth  About Hair Plantation)  అని ఒక బుక్ రాస్తున్నాను.  ఈ బుక్ లో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి సంబధించిన ప్రతి అంశం,  జుట్టుకు సంబంధించిన  ప్రతి విషయం వివరంగా ఉంటుంది.  ఈ జుట్టు వల్ల ఎంతోమంది మానసికంగా క్షోభకు గురి అవుతున్నారు. అయితే, దీనికి 100% సొల్యూషన్ ఉంది.
 
యాంకర్ : డాక్టర్ గారు,  సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ? 
 
 జాన్ వాట్స్ :  రెండో రోజే  అఫీస్ కి వెళ్లొచ్చు.    ప్రస్తుతం ‘FUE’ పద్దతిలో సర్జరీ చేస్తున్నాం,  ఈ పద్దతి వల్ల ఉపయోగం ఏమిటంటే..  సర్జరీ చేసినట్టు ఎలాంటి ఇంప్రెషన్స్  కూడా తెలియవు, అలాగే పెయిన్ కూడా లైట్ గా  ఉంటుంది.  
 
యాంకర్ :  ప్రతి రోజూ తల స్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.  కానీ రోజు తల స్నానం చేస్తే  జుట్టు ఎక్కువగా రాలుతుంది.  అసలు రోజూ తల స్నానం చేయడం మంచి పద్ధతేనా ? 

జాన్ వాట్స్ : తల స్నానం ప్రతి రోజూ చేయడం మంచి హెల్తీ హ్యాబిట్.  తల స్నానం చేయడం కారణంగా చుండ్రు సమస్యతో పాటు డస్ట్ లాంటి మిగిలిన సమస్యలను కూడా  అధిగమించొచ్చు.  అలాగే  రాలిపోయే జుట్టు ప్లేస్ లో కూడా కొత్త హెయిర్ వస్తోంది.  కాబట్టి, తల స్నానం వల్ల ఎలాంటి సమస్య లేదు. 
 
యాంకర్ : హెడ్ వాష్ కి ఏ షాంపూ మంచిది అంటారు ? 
 
జాన్ వాట్స్ :   చాలా రకాల షాంపూలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.  కానీ  షాంపూ వల్ల పర్పస్ ఏమిటంటే..  తలలో పేరుకుపోయిన డస్ట్ గానీ, ఆయిల్ ను గానీ క్లియర్  చేయడం.  కానీ ఈ షాంపూల్లో  వాడే సోడియం లారెత్ సల్ఫేట్ అనే  పదార్థం కొంచెం ప్రమాదకరం. అయితే, అందరికీ దీనివల్ల రియాక్షన్స్ ఏమి రావు. కానీ,  కొందరికి రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

యాంకర్ :  హెడ్ వాష్ కి ఎలాంటి  షాంపూ వాడితే  సైడ్ ఎఫెక్ట్స్ రావు ?
జాన్ వాట్స్ :   అందరూ  ప్రశాంతంగా  వాడుకోగలిగే షాంపూ  ఏదైనా ఉంది అంటే.. ఏమైనా మైల్డ్ షాంపూస్  వాడుకోవచ్చు.  లేదా బేబీ షాంపూ వాడొచ్చు.  అలోవెరా షాంపూస్ వాడొచ్చు.
 
యాంకర్ :  అసలు,   ఏ వయసువారైనా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవచ్చా?

జాన్ వాట్స్ : కచ్చితంగా చేసుకోవచ్చు.  కాకపోతే 25 ఏళ్ల నుండి  45 ఏళ్ల మధ్య  వయసు ఉన్న  వారికి మంచి రిజల్ట్స్ వస్తాయి.  అయితే,   ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్‌ ప్లాంటేషన్స్‌ లో చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే  ఏ వయసు వారికైనా సరే  వారి  బట్టతలకు    వేరే పద్ధతులు ద్వారా కూడా  పరిష్కారం ఉంది.  
 
 
యాంకర్ :  హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత   సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ?
 
జాన్ వాట్స్ :   ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్‌ ఉండవు.  మా దగ్గర  సర్జరీ చేయించుకున్న క్లయింట్స్‌ తో  కూడా   మీరు డైరెక్ట్ గా  మాట్లాడి  ప్రతి విషయాన్ని అడిగి  తెలుసుకోవచ్చు.  ట్రాన్స్‌ ప్లాంటేషన్స్‌  వల్ల  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ ఉండవు.
 
 
యాంకర్ :  బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు  కూడా  హెయిర్ ప్లాంటేషన్   చేయించుకోవచ్చా?   
 
జాన్ వాట్స్ :   చేయించుకోవచ్చు.  కాకపోతే ముందుగా  బీపీ, షుగర్ లెవల్స్ ను  కంట్రోల్ కి తెచ్చి..   ప్రోటోకాల్ ప్రకారం సర్జరీ చేయాలి. మా క్లయింట్స్ లో  బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.  వారికి మంచి రిజల్ట్స్ వచ్చాయి.  చాలా సంతోషంగా ఉన్నారు.                
 
యాంకర్ : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత.. మెయిన్ గా ఫాలో అవ్వాల్సిన అంశాలు ఏమిటి ? 
 జాన్ వాట్స్ :  సర్జరీకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు చూజ్ చేసుకున్న సర్జన్ కి ఎక్కువ అనుభవం ఉందా ?, అతని దగ్గర స్కిల్ ఫుల్  టీమ్ ఉందా ? అండ్ అతను ఆల్ రెడీ సర్జరీలు చేసిన రికార్డ్స్ అండ్  ఎంత సక్సెస్ రేటు అని  క్షుణ్ణంగా  చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే  మీరు  కరెక్ట్ సర్జన్ ను ఎన్నుకుంటారో  అప్పుడు మాత్రమే మీకు  గుడ్ రిజల్ట్స్ వస్తాయి.    
 
యాంకర్ :  సౌత్ ఇండియాలోనే   మీ ట్రైకోస్ సంస్థకి   ‘బెస్ట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్’ అని చాలా  అవార్డ్ లు, రివార్డులు వచ్చాయి. ఎలా ఫీల్ అవుతున్నారు ? 
 జాన్ వాట్స్ :  నాకు  నా  క్లయింట్ కళ్ళల్లో కనిపించే  ఆ చిరునవ్వే  నాకు  నిజమైన అవార్డు అండ్ రివార్డు.  చివరగా   బాల్డ్ నెస్ కి చక్కని  పరిష్కారం ఉంది. ఎవరూ చింతించకండి.

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ & హెయిర్ కు సంబంధించిన అన్ని డౌట్స్ ఈ ఒక్క వీడియోతో క్లియర్ అవుతాయి |TRICHOS

 

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version