Halal meat row: టీమిండియా ఆటగాళ్లకు ‘హలాల్ మాంసం’.. పెను దుమారం

Halal meat row: టీమిండియా మరోమారు వివాదాల్లో చిక్కుకుంది. డైట్ మెనూలో లోపాలు బహిర్గతమయ్యాయి. క్రీడాకారులకు అందించే మాంసం హలాల్ చేసిందే ఉండాలని నిబంధన విధించడంతో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై నెట్టింట్లో వైరల్ సృష్టిస్తోంది. డైట్ ప్లాన్ పై విమర్శల దాడి రేగుతోంది. ఇప్పటికే ఓటములతో కుదేలైపోయిన టీమిండియా మారోమారు వార్తల్లో నిలుస్తోంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్ లో హలాల్ మాంసం తీసుకురావడంపై చర్చ సాగుతోంది. హలాల్ మాంసం ఒక ముస్లింలు […]

Written By: Srinivas, Updated On : November 25, 2021 9:59 am
Follow us on

Halal meat row: టీమిండియా మరోమారు వివాదాల్లో చిక్కుకుంది. డైట్ మెనూలో లోపాలు బహిర్గతమయ్యాయి. క్రీడాకారులకు అందించే మాంసం హలాల్ చేసిందే ఉండాలని నిబంధన విధించడంతో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై నెట్టింట్లో వైరల్ సృష్టిస్తోంది. డైట్ ప్లాన్ పై విమర్శల దాడి రేగుతోంది. ఇప్పటికే ఓటములతో కుదేలైపోయిన టీమిండియా మారోమారు వార్తల్లో నిలుస్తోంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్ లో హలాల్ మాంసం తీసుకురావడంపై చర్చ సాగుతోంది. హలాల్ మాంసం ఒక ముస్లింలు మాత్రమే తింటారు. హిందువులు, సిక్కులు తినరు. కానీ బీసీసీఐ నిర్వాకంతో ట్విటర్ వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ముస్లిం ఒక్కరే ఉన్నా హలాల్ మాంసం ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. డైట్ మెనూలో ఇలా హలాల్ మాంసం పెట్టడంపై అభిమానుల్లో సైతం ఆగ్రహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై మరో సెగ తగులుతోంది. దీనిపై టీమిండియా విమర్శలపై బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమాల్ క్లారిటీ ఇచ్చారు. డైట్ ప్లాన్ లో జరిగిన లోపాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

అయితే మాంసం వషయంలో ఎలాంట ఆంక్షలు లేకున్నా హలాల్ మాంసం ఎందుకు వచ్చిందో తెలియదని చెబుతున్నారు. మాంసం విషయంలో ఏం జరిగిందనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆటగాళ్లలో కూడా అయోమయం నెలకొంది. తమ డైట్ లో ఇలాంటి నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డైట్ ప్లాన్ పై ఇంతలా వివాదాలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు. ఎవరి ఇష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. బీసీసీఐ జోక్యం చేసుకుని ఇలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. మాంసం మెనూలో హలాల్ అంశంతో ఇప్పుడు బీసీసీఐ సర్వత్రా విమర్శలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: David Warner: కప్ అందించిన డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ అంత అవమానించిందా?

Tags