https://oktelugu.com/

Blood Sugar Level : రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా నిర్వహించడానికి టాప్ 7 ఆహారాలు

మధుమేహం అనే సమస్య లేకపోతే ఆహారం విషయంలో ఎవ్వరూ నియంత్రణలో ఉండరు కావచ్చు కదా.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 4, 2024 / 03:33 PM IST

    Blood Sugar Level

    Follow us on

    Blood Sugar Level : మధుమేహం అనే సమస్య లేకపోతే ఆహారం విషయంలో ఎవ్వరూ నియంత్రణలో ఉండరు కావచ్చు కదా. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువ కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణం అయేది. కేలరీలు కూడా ఎక్కువగా వచ్చేవి కావు. కరిగిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. కార్బోహైడ్రేట్స్, కొలెస్ట్రాల్, కేలరీలు అని లెక్క గట్టుకుని మరీ తినాల్సిన వస్తుంది. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి చాలా రకాలుగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచే వెజిటేరియన్ ఫుడ్ గురించి తెలుసుకుందాం.

    ఆకు కూరలు: తక్కువ పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకుకూరల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కాల్షియం, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. కేవలం ఒక్కటని కాదు ఈ ఆకుకూరల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వీటిని మీ డైట్ లో భాగం చేసుకోవాలి.

    బెర్రీస్: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడటానికి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ బెర్రీలు మీకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. బెర్రీలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో సులభంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక దాల్చిన చెక్క కూడా మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మసాలా దినుసు అని లైట్ తీసుకోవద్దు. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణం, బ్లడ్ షుగర్‌ని తగ్గించే సహజమైన గుణాలు దీనిలో ఉంటాయి. అందుకే ఈ మసాలాను యాడ్ చేసుకోండి.

    చియా విత్తనాలను కూడా మీ డైట్ లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియను మందగించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఈ చియా విత్తనాలను మీ డైట్ లో చేర్చుకొని జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోండి. ఇక అవకాడోస్ కూడా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ పిండి పదార్థాలు, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. చిలకడదుంపలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడే తక్కువ-గ్లైసెమిక్ కార్బ్ గా ఉపయోగపడతాయి. గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నిరోధించే, స్థిరత్వాన్ని ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులను అందించడానికి వీటిని తీసుకోండి.