https://oktelugu.com/

Weight Loss : బరువు తగ్గడానికి నివారించాల్సిన 7 ఆహారాలు

ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారం, వాతావరణం వంటివి బరువును పెంచుతున్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 4, 2024 / 03:25 PM IST

    Weight Loss

    Follow us on

    Weight Loss : ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారం, వాతావరణం వంటివి బరువును పెంచుతున్నాయి. ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో వారికి సమయం లేకపోవడం బయట ఏది పడితే అదే తింటున్నారు. ఆహారం విషయంలో సరైన నియమాలను పాటించడం లేదు. దీంతో అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ బరువును ఎలా తగ్గించుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కొందరు.

    బరువు పెరిగిన తర్వాత జిమ్ లకు వెళ్లడం, వాకింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇంకొందరు ఆహారం పూర్తిగా మానేస్తారు. అల్పాహారం మానేస్తారు. లేదంటే రాత్రి భోజనం మానేస్తారు. ఇలా చాలా కఠినమైన నియమాలు పెట్టుకుంటారు. కొందరు మాత్రం సరైన ఆహారం తీసుకోవాలి అనుకుంటారు. మరి మీ బరువు తగ్గాలంటే మీరు కొన్ని ఆహారాలకు పులిస్టాప్ పెట్టాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఓ సారి చూసేద్దామా?

    చక్కెర పానీయాలు: సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, తియ్యటి రసాలు వంటివి చాలా కేలరీలతో ఉంటాయి. అంతేకాదు ఇవి చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి మీ శరీరంలో కొవ్వు నిల్వకు దోహదం చేస్తాయి. కాబట్టి బేకరీ ఐటమ్స్, చక్కెర ఉండే ఆహారాలను పూర్తిగా మానేయడం వల్ల మీరు బరువు పెరగకుండా ఉండవచ్చు. సో ఈ ఆహారాలను కాస్త స్కిప్ చేయండి.

    శుద్ధి చేసిన పిండి పదార్థాలు: వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీలు వంటి ఆహారాలు ఫైబర్, పోషకాలతో ఉండవు. అంతేకాదు రక్తంలో చక్కెరను పెరిగేలా చేస్తాయి. ఆకలిని పెంచుతాయి. తద్వారా ఎక్కువ ఆహారం తీసుకోవాలి అనిపిస్తుంది. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ఆహారాలను స్కిప్ చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు.

    ఫాస్ట్ ఫుడ్: బర్గర్‌లు, ఫ్రైలు, వేయించిన స్నాక్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండండి. ప్రాసెస్ చేసిన మాంసాలను కూడా స్కిప్ చేయండి. సాసేజ్‌లు, బేకన్‌లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకునే వారు ఈ సంతృప్త కొవ్వులను కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్త. బంగాళాదుంప చిప్స్ ను కూడా స్కిప్ చేయండి. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉంటాయి. వీటికి అలవాటు పడితే ఎక్కువ తినాలి అనిపిస్తుంది.

    అధిక క్యాలరీ డెజర్ట్‌లను కూడా స్కిప్ చేయండి. కేకులు, ఐస్ క్రీములు, కుకీలు చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ప్రధానంగా దోహదపడతాయి. ఇక ఆల్కహాల్ ను పూర్తిగా మానేయండి. అధిక కేలరీల మద్య పానీయాలు, ముఖ్యంగా బీర్, కాక్టెయిల్స్, కొవ్వు పేరుకుపోవడానికి, జీవక్రియను నెమ్మదింపజేయడానికి దోహదం చేస్తాయి. అందుకే ఈ ఆహారాలను స్కిప్ చేయడం చాలా మంచిది.