రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినే వారికి షాకింగ్ న్యూస్..?

మారుతున్న కాలంతో పాటే చాలామంది సమయం ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌ లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే వంట అయిపోవడంతో పాటు సులభంగా వంట చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే మంచిదేనా..? అనే ప్రశ్నకు వైద్య నిపుణులు కాదని సమాధానం ఇస్తున్నారు. రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు. […]

Written By: Navya, Updated On : November 29, 2020 8:08 am
Follow us on


మారుతున్న కాలంతో పాటే చాలామంది సమయం ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌ లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే వంట అయిపోవడంతో పాటు సులభంగా వంట చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే మంచిదేనా..? అనే ప్రశ్నకు వైద్య నిపుణులు కాదని సమాధానం ఇస్తున్నారు.

రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు. అన్నం వండుకునే సమయంలో గాలి, వెలుతురు తగులుతూ ఉండాలని అలాంటి ఆహారం తింటే సమస్యలు రావని సూచిస్తున్నారు. రైస్ కుక్కర్ లలో వండిన ఆహారం తింటే ఉదర సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, కీళ్ల వాతం, నడుము నొప్పి, అధిక బరువు ఇతర సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు.

గృహిణులు, యువత రైస్ కుక్కర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని.. రైస్ కుక్కర్ లో అన్న వండుకోవడంతో పాటు గుడ్లు ఉడికించుకోవడం, కూరలు వండుకోవడం చేస్తున్నారని.. అయితే వీలైనంత వరకు రైస్ కుక్కర్లను వినియోగించుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రైస్ కుక్కర్ లో వండిన ఆహారాన్ని నిల్వ చేయడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు.

ఎంతో అవసరమైతే తప్ప రైస్ కుక్కర్లలో అన్నం వండుకోకూడదని.. అలా చేస్తే తాత్కాలికంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.