దేశంలో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే కొంతమంది మాత్రం బరువు పెరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వయస్సు పెరుగుతున్నా వయస్సుకు తగిన బరువు లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాళ్లు దేశంలో ఎంతోమంది ఉన్నారు. బరువు పెరగడం కష్టంగా కాకపోయినా కొందరు ఎంత ప్రయత్నించినా తాము బరువు పెరగడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. తినే ఆహారం కన్నా ఎక్కువగా శ్రమించేవారు, ఆహారం తక్కువగా తీసుకునే వారు తక్కువ బరువు ఉంటారు.
Also Read: త్వరపడండి: శృంగారంతో 100 ఏళ్లు అంట!
బరువు పెరగాలనుకునే వారు శక్తిని అందించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎందువల్ల బరువు పెరగడం లేదో గుర్తించి ఏ సమస్య లేకపోతే డైట్ పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. సమయానికి మూడు పూటలా ఆహారం తీసుకోవడంతో పాటు ఏ సమయానికి ఏం తినాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. చాలామంది బరువు తగ్గడానికి మాత్రమే వ్యాయామాలు ఉంటాయని భావిస్తారు. కానీ వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్ లాంటి వ్యాయామాలు బరువు పెరగడానికి తోడ్పడతాయి.
మాంసాహారం తినేవాళ్లు సాల్మన్ చేపలను డైట్ లో చేర్చుకుంటే సులువుగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే చీజ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. తక్కువ బరువు సమస్యతో బాధ పడే వాళ్లు చపాతీలు, రొట్టెల కంటే అన్నం ఎక్కువగా తీసుకోవాలి. అమ్మాయిలు అయోడిన్, కాల్షియం, ఐరన్ లభించే ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. రుచిగా ఉండటంతో పాటు తక్షణమే శక్తిని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవాలి.
Also Read: రోజూ తేనె తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా రెండు, మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటే శరీరంలో కేలరీల స్థాయి పెరగడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తాజా పండ్లను డైట్ లో చేర్చుకుంటే సులువుగా బరువు పెరగవచ్చు. పండ్లు ఎక్కువగా ఇష్టపడని వాళ్లు పండ్లను జ్యూస్ రూపంలో చేసుకుని తీసుకుంటే మంచిది.