https://oktelugu.com/

ఎమ్మెస్సీ అభ్యర్థులకు బార్క్ శుభవార్త.. రూ.40,000 స్టైఫండ్ తో ఫెలోషిప్..?

బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ ఎమ్మెస్సీ చదివిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీ కోసం బార్క్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలకు రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం జనవరి 15 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://recruit.barc.gov.in/ వెబ్ సైట్ లో ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2020 / 07:57 AM IST
    Follow us on


    బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ ఎమ్మెస్సీ చదివిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీ కోసం బార్క్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలకు రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం జనవరి 15 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://recruit.barc.gov.in/ వెబ్ సైట్ లో ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

    Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    ఎమ్మెస్సీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ లేదా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ లేదా ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ చదివిన వాళ్లు ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ-సీఎస్ఐఆర్‌నెట్ ఫెలోషిప్ అర్హత పరీక్షల్లో వాలిడ్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇవి కాకుండా డీబీటీ-జేఆర్‌బి బ‌యోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌, ఐసీఎంఆర్‌జేఆర్ఎఫ్ టెస్ట్‌, ఐకార్‌జేఆర్ఎఫ్ టెస్ట్‌, గేట్ 2019, 2020 లలో మార్కుల ఆధారంగా రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీ జరుగుతుంది.

    దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఇంటర్య్వూలో ప్రతిభ ఆధారంగా రిసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపిక చేస్తారు. రిసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపికైన వారికి నెలకు 31,000 రూపాయలు స్టైఫండ్ గా, 7,440 రూపాయలు హౌస్ రెంట్ అలోవెన్స్ గా లభిస్తుంది. రిసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపికైన వాళ్లు దాదాపు 40,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి కంటింజెన్సీ గ్రాంట్ కింద 40,000 రూపాయలు లభిస్తుంది.

    Also Read: ఇంగ్లీష్ రాని వారికి శుభవార్త.. ఆన్ లైన్ లో రామ‌కృష్ణ మ‌ఠం ఇంగ్లీష్ క్లాసులు..!

    తక్కువ సంఖ్యలో రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు ఉండటంతో వీలైనంత త్వరగా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేస్తే మంచిది. రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.