మనలో చాలామందిని వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కీళ్ల సమస్యలు, వెన్నునొప్పి వేధిస్తున్నాయి. ఎముకలు బలహీనంగా ఉంటే చిన్నచిన్న గాయాలైనా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఆరోగ్యకరమైన జీవనాన్ని జీవించగలిగే అవకాశం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గడంతో పాటు ఎముకలు పెళుసుబారడం జరుగుతుంది.
Also Read: పిల్లలకు పీడకలలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా..?
జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా ఎముకలు దృడత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మనం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉండేలా చూసుకోవచ్చు. విటమిన్ డి, కాల్షియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. సరైన పోషకాహారం తీసుకుంటే మాత్రమే ఎముకల అరుగుదలకు సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
ఎముకలు దృఢంగా ఉండాలనుకునే వారు ప్రతిరోజు జున్ను, పెరుగు లాంటి పాల ఉత్పత్తులను తమ డైట్ లో చేర్చుకుంటే మంచిది. ఎముకలు బలంగా ఉండాలంటే పిస్తా, బాదం, పప్పులు తీసుకోవడంతో పాటు ప్రతిరోజు పాలు తాగాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న సీతఫలం, సపోటా పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. బయట వండిన ఆహారం కంటే ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కోడిగుడ్లు, చేపలు, మాంసం తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
Also Read: సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి సులభ మార్గాలివే..?
పాలకూరను తరచూ తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలహీనపడకుండా రక్షించుకోవచ్చు. తాజా కూరగాయలు తీసుకోవడం, ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా ఉండేలా కాపాడుకోవచ్చు. పురుషులకు 1000ఎంజీ, టీనేజర్లకు 1,300 ఎంజీ, మహిళలకు 1,200 ఎంజీ కాల్షియం అందితే ఎముకలు దృఢంగా ఉంటాయి.