https://oktelugu.com/

Tomato: అందరికీ టమాటాలు సూట్ కావు.. ముఖ్యంగా వీరు మాత్రం దూరంగా ఉండాలి..

టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో టమాటాలు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయట. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు మాత్రం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 11, 2024 / 06:52 AM IST

    Tomato

    Follow us on

    Tomato: టమాటా లేని కూరలు ఉండవు కద. వంకాయ టమాటా, ఆలు టమాట, టమాట పప్పు ఇలా చాలా వంటల్లో టమాట ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదండోయ్. టమాటా ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ తదితర పోషకాలు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా, రుచిగా ఉన్నా టమాటాలు ఎక్కువగా తినవద్దు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వారు వీటికి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదట. మరి ఎవరు దూరంగా ఉండాలి? ఎందుకు ఉండాలి అనే వివరాలు చూసేద్దాం.

    టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో టమాటాలు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయట. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు మాత్రం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లిమిటెడ్ గా ఈ టమాటాలను తీసుకోండి అంటున్నారు ఆయుర్వేదం నిపుణులు. లేదంటే ఒక్కోసారి మూత్రపిండాలు దెబ్బతింటాయట కూడా.

    టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది ఈ సోలినిన్. టమాటాలు మన కణాలలో కాల్షియం ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇది తీసుకుంటే మాత్రం వాపు వస్తుంది. నిలబడటం, కూర్చోవడం, ఒక్కోసారి నడవడం కష్టం అవుతుంది.

    టమాటాలోని హిస్టామిన్ అనే పదార్థం శరీరానికి అలర్జీల సమస్యలను కలిగిస్తుంది. టమాటాలు ఎక్కువగా తీసుకుంటే గొంతులో చికాకు, తుమ్ములు, తామర, నాలుక, ముఖం, నోటి వాపు వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ సమస్యలు ఉంటే, మీ ఆహారంలో టమటాలను తినడం తగ్గించుకోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు.

    టమాటాల్లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి టమాటాలను తీసుకుంటే గుండెల్లో మంట, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు టమాటాలు చాలా తక్కువ తీసుకోవాలట. కొందరికి రక్తం త్వరగా గడ్డకట్టదు. దీనికోసం మందులు ఉపయోగించే వారు కూడా ఉన్నారు. ఇలాంటి మందులకు హాని కలిగిస్తుంది టమాట.

    స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీల సమస్యలు ఉన్నవారు ఈ టమాటలకు దూరంగా ఉండటమే మంచిది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు మాత్రమే అసలే టమాట జోలికి వెళ్లకూడదు. ఒక కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా విరేచనాలు అయితే కూడా టమాటలు తినవద్దు. కొందరు పరగడుపున ఖాళీ కడుపుతో టమాట తింటారు కొందరు. ఇలా తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. టమోటాని తినే ముందు దానికి స్టార్టింగ్ పాయింట్ ని కట్ చేసి మిగిలిన భాగాన్ని మాత్రమే తినాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.