https://oktelugu.com/

Periods: పీరియడ్స్ సమయంలో చాక్లెట్స్ తింటున్నారా?

చాక్లెట్స్ తినడం చాలా మందికి ఇష్టం కదా. వీటిని చిన్న పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్లు కూడా కోరుకుంటారు. మరీ ముఖ్యంగా మగవారు కూడా చాక్లెట్స్ ను ఇష్టపడుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 11, 2024 / 07:45 AM IST

    Periods Delay Reason

    Follow us on

    Periods: స్త్రీలకు ప్రతి నెల నెలసరి వస్తుంటుంది. ఈ నెలసరి వచ్చిన సమయంలో కడుపునొప్పి ఎక్కువగా బాధ పెడుతుంది. శరీరంలో పలు రకాల మార్పులు కూడా వస్తుంటాయి. ఈ సమయంలో స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతారు. ఈ నెలసరి సమాజంలో కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకోరు. మరికొందరు మాత్రం కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాలు తీసుకుంటారు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మహిళలు చాక్లెట్ తినాలి అనుకుంటారు. దీని వెనుక ఉన్న రీజన్ చాలా మీకు తెలుసా? అయితే ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం.

    చాక్లెట్స్ తినడం చాలా మందికి ఇష్టం కదా. వీటిని చిన్న పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్లు కూడా కోరుకుంటారు. మరీ ముఖ్యంగా మగవారు కూడా చాక్లెట్స్ ను ఇష్టపడుతున్నారు. ఒక బైట్ తింటే హాయిగా తేలిపోయే వారు కూడా ఉన్నారు. చాక్లెట్స్ కు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి బాబు. అయితే వీటిని పీరియడ్స్ సమయంలో ఆడవారు మరింత ఎక్కువ కోరుకుంటారు.

    పీరియడ్స్ సమయంలో ఆడవారి శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. వీటిని తట్టుకోవడంలో చాక్లెట్ తోడ్పడుతుంది. చాక్లెట్ లో ఉండే కొన్ని పదార్థాలు అంటే షుగర్, కోకో, మెగ్నీషియం, మహిళలకు సాంత్వనాన్ని అందిస్తాయి. అంతేకాదు శక్తిని కూడా అందిస్తాయి. పీరియడ్స్ సమయంలో మహిళల శరీరంలో కొన్ని హార్మోనల మార్పులు వస్తుంటాయి. పీరియడ్స్ సమయంలో సెరోటోనిన్ అనే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గినప్పుడు మహిళలు ఉద్రిక్తత, అశాంతి, ఒత్తిడికి ఎక్కువగా గురి అవుతారు.

    చాక్లెట్ లో ఉన్న కోకో, షుగర్ ఇతర పదార్థాలు సెరోటోనిన్ స్థాయిని పెంచడంలో తోడ్పడతాయి. దీనివల్ల మహిళలు సంతోషంగా, రిలీఫ్ గా ఫీల్ అవుతుంటారు. చాక్లెట్ లో ఉండే షుగర్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమయంలో శరీరానికి శక్తి కొరత ఉంటుంది. అందుకే చాక్లెట్ తినడం ఇన్సులిన్ స్థాయిలను పెరుగుతాయి. దీంతో శరీరానికి తగిన శక్తి అందుతుంది. కాబట్టి మహిళలు పీరియడ్స్ సమయంలో శక్తి కొరత, అలసట వంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే చాక్లెట్స్ ను తీసుకోవాలి.

    ఈ సమస్యలను అధిగమించడానికి మహిళలు చాక్లెట్స్ తినడానికి ఇష్టపడుతారు. చాక్లెట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన కార్యకలాపాలకు అవసరం. మెగ్నీషియం పీరియడ్స్ సమయంలో కంటి నొప్పులు, ఆందోళన, ఒత్తిడి, శరీర నొప్పులు వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.

    పీరియడ్స్ సమయంలో శరీరంలో మాత్రమే కాదు మనసు పరంగా కూడా చాలా మార్పులు వస్తాయి. ఇవి మహిళలపై తీవ్ర ప్రభావం చూపి వారిని గందరగోళానికి గురి చేస్తాయి. చాక్లెట్ తినడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చు. అలాగే చాక్లెట్ లో ఉండే పదార్థాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. శక్తిని పెంచుతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..