https://oktelugu.com/

Edible Oil: వాడిన నూనెను వాడితే ఇక అంతే సంగతులు..అందుకే కొత్త మార్గదర్శకాలు..

రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నూనె వినియోగించే రెస్టారెంట్లు తమ వాడిన నూనెను ప్రామాణిక ఏజెన్సీలకు మాత్రమే విక్రయించాలని ఎఫ్ఎస్ఎస్ఐ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 11, 2024 / 06:08 AM IST

    Edible Oil

    Follow us on

    Edible Oil: వంటలో వాడిన నూనెను మళ్లీ వాడటం ఆరోగ్యానికి హానికరం. వాడిన నూనెను రీహీట్ చేసి తిరిగి వంటకాలకు ఉపయోగించవద్దు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల శరీర సమతౌల్యం చెడిపోతుంది. అనేక వ్యాధులు కూడా సోకుతాయి. వాడిన నూనెను మళ్లీ వాడితే పర్యావరణానికి కూడా నష్టమేనట. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ నూనెల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

    బయో డీజిల్ ఉత్పత్తి: హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్ల నుంచి వాడిన నూనెను సేకరిస్తారు. ఈ సేకరించిన నూనెను బయో డీజిల్ తయారీలో ఉపయోగించే విధానాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్సై ప్రోత్సహిస్తోంది. ఈ చర్యతో పర్యావరణానికి లాభం కలగుతుంది. వాడిన నూనెను పునర్వినియోగం చేయడం వల్ల ఆహార భద్రతకు కూడా సహకరించవచ్చు అంటున్నారు అధికారులు.

    హైదరాబాద్ రెస్టారెంట్ల భాగస్వామ్యం
    హైదరాబాద్‌లో దాదాపు 60,000కు పైగా రెస్టారెంట్లు ఉన్నాయట. వీటిలో ప్రతిరోజూ వందల లీటర్ల నూనె వాడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో 25 లీటర్లకు పైగా వాడిన నూనె మిగులుతోందని సమాచారం. చాలామంది ఈ నూనెను స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు అమ్ముతున్నారు. కొందరు డ్రెయిన్లలో పారబోస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు పర్యావరణానికి కూడా ముప్పు పెరుగుతోంది.

    రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నూనె వినియోగించే రెస్టారెంట్లు తమ వాడిన నూనెను ప్రామాణిక ఏజెన్సీలకు మాత్రమే విక్రయించాలని ఎఫ్ఎస్ఎస్ఐ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే వాడిన నూనెను సురక్షితంగా సేకరించడం, ఆహార కల్తీని తగ్గించడానికి ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయి.

    బయో డీజిల్ తయారీ ద్వారా పర్యావరణ లాభాలు: GHMC ఆధ్వర్యంలో ప్రస్తుతం 300కు పైగా రెస్టారెంట్ల నుంచి 210 టన్నుల నూనెను సేకరించారు. ఈ నూనెను ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని బయో డీజిల్ తయారీ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈ విధానం పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు వాడిన నూనెకు వ్యాపార పరంగా విలువ వస్తుంది కూడా.

    ఆర్థిక లాభాలు: ఒకసారి ఉపయోగించిన నూనెను అమ్మడం ద్వారా రెస్టారెంట్లకు రూ.40-45 వరకు వస్తుంది. ఈ విధంగా, నూనెను సురక్షితంగా విక్రయించవచ్చు. రెస్టారెంట్లు కొంతమేర డబ్బు కూడా వస్తుంది.

    ‘‘ఎఫ్ఎస్ఎస్ఐ మార్గదర్శకాల ప్రకారం 50 లీటర్ల కంటే ఎక్కువ నూనె వాడే ప్రతి రెస్టారెంట్, ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏజెన్సీలకు మాత్రమే వాడిన నూనెను విక్రయించాలి అంటున్నారు ఈ నూనెను బయో డీజిల్ తయారీలో ఉపయోగిస్తారు,’’ అని తెలిపారు ఎల్‌బీ నగర్, పటాన్‌చెరు ఫుడ్ సేఫ్టీ అధికారులు లక్ష్మీకాంత్ మరియు భానుతేజ గౌడ్. వీటి గురించి చాలామందికి అవగాహన లేదని.. అందుకే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని తెలిపారు. దీని వల్ల హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీని, పర్యావరణ సమస్యలను తగ్గించవచ్చు. అలాగే వాడిన నూనెను మళ్లీ వాడకుండా అడ్డుకోవచ్చు. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.