https://oktelugu.com/

Heart Disease : గుండె జబ్బులు రాకూడదంటే.. వెల్లుల్లిని ఇలా తినండి

రోజు మనం వాకింగ్ చేసే సమయంలో రెండు వెల్లుల్లి రెబ్బలు నోట్లో వేసుకుని చప్పరిస్తూ పోతే గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 7:53 pm
    Follow us on

    Heart Disease : ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. చిన్న వయసులోనే వీటితో చాలా మంది సతమతమవుతున్నారు. మనం తినే ఆహారాలే మనకు గుండె పనితీరు మందగించేలా చేస్తున్నాయి. అయినా మనం ఉప్పు, నూనె, కారాలు వదలడం లేదు. దీంతో రక్తనాళాలకు రక్తసరఫరా సరిగా సాగడం లేదు. దీంతోనే గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. పాతికేళ్లకే గుండె నొప్పితో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉంటున్నాయి.

    గుండె సరిగా..

    గుండె వేగం సరిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ ఆహారాలు తీసుకోవాలి? గుండెకు ముప్పు తెచ్చే వాటిలో ఉప్పు ప్రధానమైనది. ఉప్పు ఎక్కువగా తింటే గుండె జబ్బులు రావడం ఖాయం. ఇంకా ఉప్పుతో పాటు నూనె, కారం ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా జరగకుండా చేస్తాయి. దీంతో గుండె జబ్బులు విస్తరిస్తున్నాయి. గుండె జబ్బుల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

    చెడు కొలెస్ట్రాల్

    రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే కూడా రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా ట్రైగ్లిజరైడ్స్ రక్తనాళాలకు అడ్డుపడతాయి. దీంతో గుండెకు వేగంగా రక్తం సరఫరా కాదు. దీని వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల కూడా గుండె పోటుకు దారితీస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యే ఆహారాలు తీసుకుంటే ఈ సమస్య వస్తుంది.

    వెల్లుల్లి

    గుండె జబ్బు రాకుండా చేసే వాటిలో వెల్లుల్లి ఒకటి. వీటితో మనకు గుండె జబ్బు ముప్పు ఉండదు. రోజు మనం వాకింగ్ చేసే సమయంలో రెండు వెల్లుల్లి రెబ్బలు నోట్లో వేసుకుని చప్పరిస్తూ పోతే గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ఇలా వెల్లుల్లి కూడా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండెపోటు రాకుండా చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.