https://oktelugu.com/

Tips: అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలంటే.. ఈ ఆకులు ఉపయోగించాల్సిందే

పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆలివ్ ఆకులను ఉపయోగించి అందం, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: , Updated On : January 23, 2025 / 07:43 PM IST
Olive leaves

Olive leaves

Follow us on

Tips: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా (Beauty) కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు (Tips) కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో (Young Look) కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ రెండు కూడా ఉండాలంటే కొన్ని ఆకులు బాగా ఉపయోగపడతాయి. అవే ఆలివ్ ఆకులు. వీటిని ఉపయోగించి అందం, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఆలివ్ ఆయిల్ కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఆకులు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు గుండె పోటు రాకుండా కాపాడుతుంది. రోజూ ఉదయం వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ ఆకు రసం ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతుంది. ఆలివ్ ఆకుల్లోని పోషకాలు శరీర బరువును ఈజీగా తగ్గిస్తాయి. ఇది శరీరంలో ఉండే జీవక్రియను పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఆలివ్ ఆకును చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. ఈ ఆలివ్ ఆకుల్లో న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ ఆకులను డైరెక్ట్‌గా తినడం, టీ లేదా సలాడ్‌లలో కూడా కలిపి తినవచ్చు. ఇందులోని పోషకాలు అన్ని కూడా ప్రయోజనాలను మాత్రమే చేకూరుస్తాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.