https://oktelugu.com/

Sankranti ki Vasthunnam Collections : అక్షరాలా 230 కోట్లు..#RRR రికార్డ్స్ అవుట్..10 రోజుల్లోనే టాలీవుడ్ టాప్ 5 లిస్ట్ లోకి అడుగుపెట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

నేటి తరం స్టార్ హీరోలకు మాత్రం కేవలం యూత్, మాస్ ఆడియన్స్ మాత్రమే థియేటర్స్ కి కదులుతున్నారు. వీళ్ళ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కదలాలంటే వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాలి. ఉదాహరణకి రీసెంట్ గా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని తీసుకుందాం.

Written By:
  • Vicky
  • , Updated On : January 23, 2025 / 08:00 PM IST
    Sankranti ki Vasthunnam

    Sankranti ki Vasthunnam

    Follow us on

    Sankranti ki Vasthunnam Collections : సీనియర్ హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడితే థియేటర్స్ కనీసం నెల రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తాయని అందరూ అంటుంటారు. ఎందుకంటే వీళ్ళ సినిమాలు హిట్ అయితే యూత్ ఆడియన్స్ తో పాటు, మిడిల్ ఏజ్ గ్రూప్ ఆడియన్స్, అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీ స్థాయిలో క్యూలు కడుతారు. నేటి తరం స్టార్ హీరోలకు మాత్రం కేవలం యూత్, మాస్ ఆడియన్స్ మాత్రమే థియేటర్స్ కి కదులుతున్నారు. వీళ్ళ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కదలాలంటే వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాలి. ఉదాహరణకి రీసెంట్ గా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని తీసుకుందాం. ఈ చిత్రం చూసేందుకు బాగానే ఉంది కానీ, వసూళ్ల పరంగా ఇంతటి ప్రభంజనం సృష్టించేంత ఏముందని కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మొదటి ఆట నుండే సూపర్ హిట్ వచ్చిన కారణంగా ఈ రేంజ్ లో కలెక్షన్ల సునామీ ని సృష్టించింది.

    ఈ స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్ నేటి తరం స్టార్ హీరోలకు కష్టమే. ఈ సినిమాకి వస్తున్న వసూళ్ల లెక్కలు చూస్తే అనేక ప్రాంతాలలో #RRR రికార్డులు బద్దలయ్యాయి. కొన్ని ప్రాంతాలలో రీసెంట్ గా విడుదలై 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అతి చేరువలో ఉన్న పుష్ప 2 రికార్డ్స్ కూడా బద్దలయ్యాయి. కేవలం 9 రోజుల్లోనే 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది అంటూ ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా నేడు ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మాటల్లో అయితే చెప్పలేని ఆనందం. గత మూడు రోజులుగా ఆయన ఇంట్లో ఐటీ అధికారుల రైడింగ్స్ నడుస్తున్నాయి. కానీ ఆయన ముఖం ఇసుమంత భయం కూడా లేదు. ఎంతో చలాకీగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. తన కొడుకుతో ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు.

    నేడు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ లతో పాటు శిరీష్ కూడా పాల్గొన్నాడు. విలేఖరి అనిల్ రావిపూడి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ నిర్మాత అక్కడ కష్టాల్లో ఉంటే మీరేమో ఇక్కడ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు’ అని అడగగా, దానికి అనిల్ రావిపూడి సమాధానం చెప్తూ ‘మా నిర్మాత గారు బాధలో ఏమి లేరండి. నిన్న ఆయన ఇంటి పై ఇలా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసి, ఈరోజు జరగబోయే సక్సెస్ ప్రెస్ మీట్ ని వాయిదా వేస్తామని చెప్పాను. కానీ ఆయన అలాంటిదేమి వద్దు, నేను సంతోషంగానే ఉన్నాను, ఇక్కడ ఎలాంటి చిక్కులు లేవు, మన సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ ఆగకూడదు, మీరు కొనసాగిస్తూనే ఉండండి అని చెప్పాడు’ అంటూ అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.