green papayya
Bone issues: వయస్సు పెరగడం, జీవనశైలిలో మార్పులు వల్ల చాలా మంది ఈ రోజుల్లో కీళ్ల సమస్యలతో (Bone Issues) ఇబ్బంది పడుతున్నారు. వయస్సు పెరిగిన తర్వాత అనారోగ్య సమస్యలు (Health Issues) రావడమనేది సాధారణమే. కానీ పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది కీళ్ల సమస్యలతో (Bone Issues) ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయిన విముక్తి చెందాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఆహార విషయంలో (Food) జాగ్రత్తగా ఉండాలి. బాడీకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు తీసుకోకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కీళ్ల సమస్యలకు జాగ్రత్త వహించకపోతే ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధులు బారిన పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కొందరు యంగ్ ఏజ్‌లోనే కీళ్ల సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య వస్తే నడవడం, ఎక్కువ సమయం కూర్చోలేకపోవడం, తమ పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం వంటివి చేయాలి. అయితే కీళ్ల సమస్యలు ఉన్నవారు పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పచ్చి బొప్పాయిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల సమస్యలను ఈజీగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాల్షియం వంటివి పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇవి కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పచ్చి బొప్పాయిని కూర చేసుకుని అయిన తినడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే కాల్షియం ఎముకలను చాలా కాలం పాటు బలంగా ఉండేలా చేస్తాయి. అలాగే పచ్చి బొప్పాయి బరువును కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. దీన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు, డయాబెటిక్ పేషెంట్లు తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. పచ్చి బొప్పాయిలో ఉండే అన్ని మూలకాలు పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి బొప్పాయిని డైలీ తినడం జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ బొప్పాయి ఆకులను జ్యూస్ తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అలాగే బొప్పాయి పండును తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డైలీ వీటిని తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ముఖానికి దీన్ని అప్లై చేయడం వల్ల మచ్చలు, మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.