Thyroid Problem: ఈ ఆహారంతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు

గుమ్మడి గింజల్లో జింక్, సెలీనియం అధికంగా ఉంటుంది. దీంతో థైరాయిడ్ పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి. మనం నిత్యం కూరల్లో వేసుకునే కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

Written By: Srinivas, Updated On : April 29, 2023 9:30 am
Follow us on

Thyroid Problem: ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ సమస్య అందరిలో కనిపిస్తోంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ తో మహిళలకు బాగా నష్టం జరుగుతుంది. అందుకే వారికి థైరాయిడ్ పరీక్ష తరుచుగా చేస్తుంటారు. దీని లోపంతో మందులు మింగాల్సిందే. మాత్రలు వేసుకుంటూ థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందే.

గుమ్మడి గింజల్లో జింక్, సెలీనియం అధికంగా ఉంటుంది. దీంతో థైరాయిడ్ పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి. మనం నిత్యం కూరల్లో వేసుకునే కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఇందులో రాగి పుష్కలంగా ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథికి పరోక్షంగా సాయపడుతుంది.

వేసవి కాలంలో తాపం నుంచి తట్టుకోవడానికి సజ్జ గింజలతో నీళ్లు తాగుతుంటారు. ఇవి మన దేహానికి ఎంతో మేలు చేస్తాయి. థైరాయిడ్ సమస్యను కూడా ఇవి దూరం చేస్తాయి. ఎండాకాలంలో పెరుగు తినడానికి ఎక్కువగా తింటుంటాం. దీని వల్ల చల్లదనం కలుగుతుంది. పెరుగుతో కూడా థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అందుకే ఈ సీజన్ లో పెరుగును అధికంగా తీసుకోవడం మంచిదే.

పండ్లలో అత్యంత శ్రేష్టమైన పండు దానిమ్మ. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సురక్షితం. ఇందులో పాలీఫెనాల్స్ ఉండటం వల్ల థైరాయిడ్ సమస్యను నియంత్రిస్తాయి. అందుకే దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గవచ్చు. ఇలాంటి ఆహారాలు తీసుకుని మన థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.