Skin Care: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే ఫుడ్స్‌ను తింటారు. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని భావిస్తారు. అందంగా ఉండాలంటే ఫుడ్ అనేది తప్పనిసరి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఎన్ని ఆహారాలు తీసుకుని, చర్మానికి ఎన్ని చిట్కాలు పాటించిన కూడా చలికాలంలో పొడి బారిపోతుంది. కొందరు అయితే బాడీ లోషన్, మాయిశ్చరైజన్ వంటివి ఎన్నో వాడుతుంటారు. ఎన్ని ఖరీదైన వస్తువులు వాడినా కూడా ఈ కాలంలో చర్మం పొడి బారడంతో పాటు పగుళ్లు వస్తాయి. చలికాలంలో చర్మం పగుళ్లు రాకుండా తేమగా, మంచిగా ఉండాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కాకుండా సహజంగా ఉండే పద్ధతులు పాటించాలి. పూర్వ కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా ఎక్కువగా నూనెలు ఉపయోగించేవారు. అయితే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండటానికి బెస్ట్ ఆలివ్ ఆయిల్. మరి ఈ ఆలివ్ ఆయిల్‌ను చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవడానికి ఆలివ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను తొలగిస్తాయి. చలికాలంలో చాలా మంది చర్మం తొందరగా పొడిబారుతుంది. ఎన్ని బాడీ లోషన్లు రాసిన కూడా చర్మంపై పగుళ్లు రావడం, పొడి బారడం జరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే చర్మానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఇందులోని పోషకాలు చర్మం పొడిబారకుండా కాపాడుతాయి. రోజూ నిద్రపోయే ముందు చర్మానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే చర్మం పొడిబారే సమస్య క్లియర్ అవుతుంది. రాత్రి సమయం లేదు అనుకునేవారు స్నానం చేసే ఒక పది నిమిషాల ముందు అయిన ఆలివ్ ఆయిల్‌ను చర్మానికి అప్లై చేయవచ్చు. చలికాలంలో డైలీ ఇలా చేస్తే మీ చర్మ సౌందర్యం పెరగడంతో పాటు అన్ని పొడి బారే సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. అయితే ఆలివ్ ఆయిల్‌ను కేవలం చర్మానికి ఉపయోగించడానికి మాత్రమే కాకుండా వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల చర్మం కాంతివంతంగా మెరవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పొడిబారకుండా అందంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి డైలీ డైట్ లేదా చర్మానికి అయిన కూడా వాడటం అలవాటు చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.