https://oktelugu.com/

UPI: పొరపాటున తెలియని వ్యక్తులకు యూపీఐ చేశారా.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి

ఇతరులకు యూపీఐ చేసేటప్పుడు కొన్నిసార్లు తెలియక వేరే నంబర్‌కి పంపేంచేస్తుంటాం. అంటే పొరపాటున ఒక నంబర్ తప్పు కొట్టడం వల్ల డబ్బులు ఇతరుల అకౌంట్‌లోకి వెళ్లిపోతాయి. ఇలా వెళ్లిన డబ్బులు మళ్లీ పోయినట్లే. ఎందుకంటే మనకి కావాల్సిన వారికి డబ్బులు పొరపాటున వేస్తే వస్తాయని నమ్మకం ఉండదు. అలాంటిది తెలియని వ్యక్తులకు ఇలా డబ్బులు వేస్తే వాటికోసం మరిచిపోవాల్సిందేనని అనుకుంటారు. కానీ మీరు తెలియని వ్యక్తులకు పొరపాటున డబ్బులు పంపిస్తే.. ఈజీగా రిటర్న్ వచ్చేలా చేసుకోవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2024 / 03:48 AM IST

    UPI

    Follow us on

    UPI: ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఫోన్‌ పే, గూగుల్ పే వంటివి వాడుతున్నారు. నెట్ కాష్ వాడటం కంటే ప్రతీ దానికి కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఏ వస్తువు అయిన కొనాలంటే ఒకప్పుడు బయటకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం కూర్చున్న ప్లేస్ నుంచే అన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా క్షణాల్లో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి కట్టే ఇబ్బంది లేకుండా ఉన్న దగ్గర నుంచే ఇతరులకు పంపిస్తున్నారు. ఇలా కేవలం ఇతరులకు డబ్బులు పంపించడమే కాకుండా.. ప్రతీ చిన్న విషయానికి కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇతరులకు యూపీఐ చేసేటప్పుడు కొన్నిసార్లు తెలియక వేరే నంబర్‌కి పంపేంచేస్తుంటాం. అంటే పొరపాటున ఒక నంబర్ తప్పు కొట్టడం వల్ల డబ్బులు ఇతరుల అకౌంట్‌లోకి వెళ్లిపోతాయి. ఇలా వెళ్లిన డబ్బులు మళ్లీ పోయినట్లే. ఎందుకంటే మనకి కావాల్సిన వారికి డబ్బులు పొరపాటున వేస్తే వస్తాయని నమ్మకం ఉండదు. అలాంటిది తెలియని వ్యక్తులకు ఇలా డబ్బులు వేస్తే వాటికోసం మరిచిపోవాల్సిందేనని అనుకుంటారు. కానీ మీరు తెలియని వ్యక్తులకు పొరపాటున డబ్బులు పంపిస్తే.. ఈజీగా రిటర్న్ వచ్చేలా చేసుకోవచ్చు. అదెలాగో మరి తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీపై ఓ లుక్కేయండి.

    ఒక్కోసారి డబ్బులు పంపించాలనే తొందరలో మనమందరం కూడా తెలియని వాళ్లకు యూపీఐ చేస్తుంటాం. ఇలాంటి సమయాల్లో డబ్బులు పోయాయని టెన్షన్ పడవద్దు. తెలియని అకౌంట్‌కి పంపించిన డబ్బులు ఈజీగా మీ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. ఫోన్ పే నుంచి మీరు ఎవరైనా తెలియని వాళ్లకి డబ్బులు పంపిస్తే బాధపడకుండా.. వెంటనే 080-68727374, 022-68727374 ఈ నంబర్లను సంప్రదించాలి. తెలియని వ్యక్తులకు మీరు డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్‌ను ఈ నంబర్లకు పంపించాలి. ఇలా పంపించిన తర్వాత మీ అకౌంట్‌‌లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి. అయితే ఈ నంబర్లు కేవలం ఫోన్ పే వాళ్లకు మాత్రమే. అదే గూగుల్ పే అయితే 1-80-419-0157, పేటీఎమ్ అయితే 0120-38883888 నంబర్లకు వివరాలు పంపించాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎంత పెద్ద మొత్తంలో ఇతరులకు డబ్బులు పంపిన కూడా తిరిగి వచ్చేస్తాయి.

    ఇదే కాకుండా పంపించిన డబ్బులు తిరిగి రావాలంటే మీరు ఏ యాప్‌లో పంపారో ఆ కస్టమర్ కేర్ నంబర్‌కి సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. npci.org.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాట్ వీ గో ట్యాబ్ అనే యూపీఐ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఫిర్యాదుల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలి. అయితే సేమ్ బ్యాంక్ అకౌంట్‌లు అయితే ఫిర్యాదు చేసి 24 గంటల్లో డబ్బులు వస్తాయి. వేరే బ్యాంకు అకౌంట్ అయితే 48 గంటల్లో డబ్బులు వస్తాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.