Sleeping late at night: మనిషి ఆరోగ్యానికి ఆహారమే కాదు నిద్ర కూడా చాలా అవసరమే అని చాలామంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల చాలామంది రాత్రులు సరైన సమయంలో నిద్ర పోవడం లేదు. ఆలస్యంగా నిద్రపోయిన వారు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో అనేక రకాల కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి 12 గంటల తర్వాత పడుకునే వారికి కొత్త సమస్యలు వస్తున్నట్లు ఇటీవల కొన్ని రీసర్చ్ లో తేలింది. వీరిలో ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిద్రపోయిన వారిలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉంటారు. ఈ కోపం ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ చూపిస్తారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులపై కూడా చూపించడంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి తొందరగా నిద్రపోయే వారి కంటే వీరిలో కోపం అధికంగా ఉంటుందని వైద్య పరిశోధనలో తేలింది.
ఇటీవల కొంతమందికి ఆల్జీమర్స్ వ్యాధి తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఒక విషయం చెప్పినప్పుడు దానిని గుర్తుపెట్టుకోకపోవడం.. పదేపదే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అల్జీమర్స్ వ్యాధికి నిద్రలేమి కారణమని తెలుస్తోంది. కానీ ఇటీవల తేలిన పరిశోధన ప్రకారం రాత్రి 12 గంటల గంటలు దాటిన తర్వాత నిద్రించే వారిలో ఈ సమస్య ఉంటుందని గుర్తించారు. దీంతో కొన్ని విషయాలు మర్చిపోయి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కొందరు రాత్రులు నిద్ర లేదని పొద్దున సమయ పాలనా లేకుండా నిద్రిస్తూ ఉంటారు. ఇలా ఇష్టం వచ్చిన సమయానికి నిద్రపోవడం వల్ల వారి ప్రవర్తనలో అనేక మార్పులు ఉంటాయి. అంతకుముందు ఒకలాగా ఇప్పుడు మరోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇది చెడు గారు ఉండడంతో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల నిద్ర కోసం ఒక గడియారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమయంలోనే నిద్రపోవడం మంచిది.
నిద్ర సరిపోని వారు ఎక్కువగా ఒకే అంశంపై దృష్టి పెట్టకుండా ఉంటారు. దీంతో ఉద్యోగాలు లేదా వ్యాపారం చేసేవారు ఒకే పనిపై దృష్టి పెట్టకుండా ఉండడంతో వీరు దానిని సరిగ్గా పూర్తి చేయలేరు. దీంతో అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఉద్యోగం కూడా ఊ డిపోయే ప్రమాదం ఉంటుంది.
రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారిలో లేజీ ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పనిని ఆక్టివ్ గా చేయలేరు. ఆ రోజంతా వీరికి డల్ గా ఉంటుంది. దీంతో ఇతరుల నుంచి వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలా అనేక రకాల సమస్యలకు కారణమైన నిద్రలేమిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యవసరం ఉంటే తప్ప రాత్రుల్లో మెలకువ ఉండాల్సిన అవసరం లేదు. రాత్రులు తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం వల్ల శరీరం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.