Power of Nature Disasters: ప్రకృతిని ప్రకృతి మాదిరిగా ఉంచాలి. కానీ మనిషి అభివృద్ధి మోజులో పడి ప్రకృతికి వికృతి చేస్తున్నాడు. పచ్చని చెట్లను నరుకుతున్నాడు. పర్వతాలను తొలచి వేస్తున్నాడు. నదులను కలుషితం చేస్తున్నాడు. విలువైన వనరులను ఇష్టానుసారంగా వాడుతున్నాడు. అడ్డగోలుగా ప్రకృతి మీద పెత్తనం సాగిస్తున్నాడు. మనిషి చేస్తున్న దారుణాలను చూస్తున్న ప్రకృతి.. ఒకసారిగా తీవ్రంగా ప్రతిస్పందించడం మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు మనిషి చేసిన అభివృద్ధి మొత్తం సర్వనాశనం అవుతుంది.
రాజస్థాన్ రాష్ట్రం అంటే మనకు ఎడారులు గుర్తుకొస్తాయి. అక్కడ సగటు వర్షపాతం తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాదోపూర్ ప్రాంతంలో కూసిన భారీ వర్షాలు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి. సుర్వాల్ జలాశయం పూర్తిగా ఉప్పొంగింది. ఏకంగా రెండు కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతులో అతిపెద్ద గొయ్యి ఏర్పడింది.. భారీ వర్షాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో విధ్వంసం జరిగింది. కనివిని ఎరుగనిస్థాయిలో గృహాలు దెబ్బతిన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరద ఉధృతి తీవ్రంగా ఉంది.
పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. గృహాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షాలు కురవక చాలా సంవత్సరాలు అవుతోంది. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం.. అది కూడా కనివిని ఎరుగని స్థాయిలో వర్షాలు కురవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో నిండిన జలాశయాలు.. ఇప్పుడు ప్రమాదకరస్థాయి దాటిని ప్రవహించడం ఇక్కడ ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇంకా కొద్దిరోజులపాటు రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే స్థాయిలో గనుక వర్షాలు కురిస్తే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2-Km Crater Forms In Rajasthan Village As Dam Overflows Due To Heavy Rainhttps://t.co/Y7JNcxauTQ pic.twitter.com/WAwYaXgBY9
— NDTV (@ndtv) August 24, 2025