Sugar : షుగర్ ను బాగా తగ్గించే ఈ ఒక్క కూరగాయ

Sugar : ఈ రోజుల్లో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. డయాబెటిస్ కు రాజధానిగా మనదేశం మారుతోంది. దీనికి కారణం మనం అన్నం తినడమే. చక్కెర వ్యాధి ఇండియా, చైనాల్లో ఎక్కువగా పెరుగుతోంది. షుగర్ ను నియంత్రించాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. లేకపోతే మనకు శారీరక ఇబ్బందులు రాక తప్పవు. మధుమేహంతో బాధపడే వారికి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో లేకపోతే గుండె, కళ్లు, కాలేయం, మూత్రపిండాలు పాడైపోయే అవకాశం […]

Written By: Srinivas, Updated On : March 22, 2023 5:20 pm
Follow us on

Sugar : ఈ రోజుల్లో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. డయాబెటిస్ కు రాజధానిగా మనదేశం మారుతోంది. దీనికి కారణం మనం అన్నం తినడమే. చక్కెర వ్యాధి ఇండియా, చైనాల్లో ఎక్కువగా పెరుగుతోంది. షుగర్ ను నియంత్రించాలంటే కొన్ని నియమాలు

పాటించాల్సిందే. లేకపోతే మనకు శారీరక ఇబ్బందులు రాక తప్పవు. మధుమేహంతో బాధపడే వారికి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో లేకపోతే గుండె, కళ్లు, కాలేయం, మూత్రపిండాలు పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవడం మన బాధ్యత. దీని కోసం మనం కొన్ని చిట్కాలు పాటించాలి.

షుగర్ పేషెంట్లు ఏ ఆహారాలు తీసుకోవాలి? ఎలా తినాలి? అనే దానిపై అందరికి అనుమానాలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవాలి. మధుమేహం ఉన్న వారు ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం ఎలా తినాలనేదానిపై అవగాహన ఉండాలి. ఉదయం టిఫిన్ కాకుండా భోజనం చేయొచ్చు. మనం వండుకునే ఆహారాలు మట్టి కుండలో వండుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయం తెలుసుకుని వంట చేయడంలో మట్టి పాత్రలు వాడుకుని షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఇక ఏ కూరగాయలు తినాలో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయల్లో సోరకాయ తినడం ఎంతో మంచిది. సోరకాయ తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇంకా బీరకాయ, కాకరకాయ, బెండకాయ, అలసంద వంటి వాటిని తీసుకోవడం సురక్షితం. మనం తినే ఆహారంలో కూరలు ఎక్కువగా పదార్థాలు తక్కువగా ఉండాలి. తృణ ధాన్యాల్లో రాగులు, సజ్జలు, పచ్చజొన్నలు, కొర్రలు, అరికెలు వంటివి తీసుకోవడం ఉత్తమం. దీంతో షుగర్ నియంత్రణలో ఉండేందుకు ఇవి దోహదపడతాయి. భోజనం చేసే సమయంలో మంచినీళ్లు తాగకూడదు.

సాయంకాలం మనం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా పండ్లు తీసుకోవాలి. సాయంత్రం ఉడకని ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు ఓ గంటపాటు వాకింగ్ చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. రక్తపోటు, మధుమేహం నియత్రణలోకి వస్తాయి. ఫలితంగా మనకు ఎలాంటి ముప్పు ఉండదు. ఇలా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకుంటే ఎలాంటి తప్పలు రావు. ఈ నేపథ్యంలో షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి.

Tags